ETV Bharat / bharat

తల్లి, సోదరుడి మృతదేహాలతో 3 రోజులుగా ఇంట్లోనే మహిళ! - కర్ణాటక క్రైమ్​ న్యూస్​

కర్ణాటకలో హృదయవిదారక ఘటన జరిగింది. తల్లీకొడుకులు అనుమానస్పదంగా మృతిచెందారు. మతిస్థిమితం సరిగా లేని కూతురు.. మృతదేహాలతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది. చట్టుపక్కల వారు గమనించి.. పోలీసులకు సమాచారం అందించగా.. వెలుగులోకి వచ్చింది.

Aryamba
ఆర్యాంబ
author img

By

Published : May 13, 2021, 11:52 AM IST

Updated : May 13, 2021, 12:30 PM IST

బెంగళూరులోని ఓ ఇంట్లో అనుమానాస్పద రీతిలో తల్లీకొడుకు మృతి చెందారు. వారి మృతదేహాలతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది మతిస్థిమితం లేని కూతురు. ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడం వల్ల.. ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తి గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు.

ఏం జరిగిందంటే?

హరీశ్​ అనే వ్యక్తి.. బెంగళూరులోని ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడితో పాటు తల్లి ఆర్యాంబ, సోదరి శ్రీలక్ష్మి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల కొవిడ్​ బారినపడిన హరీశ్​.. హోంక్వారంటైన్​లో ఉన్నాడు. తల్లి, సోదరికి కూడా కరోనా సోకిందా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే.. వారు ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. హరీశ్​ ఆరోగ్య పరిస్థితి విషమించినందున.. రెండు మూడు రోజుల నుంచి అంబులెన్స్​ కోసం పలుమార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు చివరకు చనిపోయినట్టు తెలుస్తోంది. కొడుకు మృతిని జీర్ణించుకోలేక తల్లి కూడా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.

ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని ప్రవీణ్​ గుర్తించాడు. బాధిత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటం గమనించి.. ఆర్​.ఆర్​.సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. విగత జీవులుగా పడిఉన్న హరీశ్​, ఆర్యాంబల మృతదేహాలు కంటపడ్డాయి. ఆ సమయంలో వారి పక్కనే.. శ్రీలక్ష్మి అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపారు పోలీసులు. మూడు రోజులుగా ఆమె ఆ శవాల వద్దే ఉన్నట్టు తెలుస్తోంది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న గర్భిణీ వైద్యురాలి 'చివరి సందేశం'

Last Updated : May 13, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.