ETV Bharat / bharat

గుడిసె కాలిపోయి తల్లీకూతుళ్లు సజీవ దహనం.. అధికారులే నిప్పంటించారన్న స్థానికులు

గుడిసెకు నిప్పంటుకుని తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఆ సమయంలో గుడిసెలోనే ఉన్న బాధితులు.. అదే మంటల్లో చిక్కుకుని మరణించారు. అయితే ఘటనకు కారణం ప్రభుత్వ అధికారులేనని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

author img

By

Published : Feb 14, 2023, 9:16 AM IST

Updated : Feb 14, 2023, 11:09 AM IST

mother-and-daughters-burning-alive-in-uttarpradesh
మంటల్లో కాలిపోయిన తల్లీకూతుళ్లు

మంటల్లో చిక్కుకొని తల్లీకూతుళ్లు సజీవ దహనమైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. గుడిసెకు నిప్పంటుకోవడం వల్ల ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ప్రభుత్వ అధికారులే గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆక్రమించుకున్న స్థలంలో గుడిసెను నిర్మించారనే కారణంతో బాధిత కుటుంబంపై అధికారులు దాడి చేశారని.. కావాలనే గుడిసెకు నిప్పంటిచారని చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పుర్ దేహత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రూరల్ పోలీసు స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్న కృష్ణ గోపాల్​ గుడిసె మంటల్లో కాలిపోయింది. ప్రమాదంలో కృష్ణ గోపాల్​ భార్య.. ప్రమీలా దీక్షిత్, అతని కూతురు నేహ మంటల్లో సజీవ దహనం అయ్యారు. కృష్ణ గోపాల్​ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. బాధితులు కట్టుకున్న గుడిసెపై.. సోమవారం రెవెన్యూ అధికారులు దాడి చేశారు. అక్రమంగా గుడిసెను నిర్మించారని వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. కృష్ణ గోపాల్​ స్థలాన్ని ఖాళీ చేయనందు వల్లే అధికారులు గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు చెబుతున్నారు.

అంతకుముందే ఈ స్థలం సమస్యపై జిల్లా కలెక్టర్​ను ఆశ్రయించామని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్​ వారికి హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ, ఇంతలోనే ఈ విషాదం జరిగిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు.

ఘటన అనంతరం ఆగ్రహించిన గ్రామస్థులు... అక్కడికి వచ్చిన అధికారులపై రాళ్లు రువ్వారు. వారిపై దాడికి యత్నించారు. ఎలాగోలా అక్కడి నుంచి అధికారులు తప్పించుకున్నారు. ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఘటనకు కారణమైన ఎస్​డీఎమ్​, ఎస్​ఎచ్​ఓపై కేసు కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సృష్టం చేశారు. కాగా ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Last Updated : Feb 14, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.