కరోనా రెండో దశ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. ఇప్పటికే భారతావనిలోని చాలా ప్రాంతం ఆ తరహా వాతావరణంలోకి జారుకుంది.
ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించిన కఠిన ఆంక్షలను ఓ మారు పరిశీలిస్తే..
- దిల్లీ గత నెల 19 నుంచి లాక్డౌన్లో ఉంది. ఈ నెల 10 వరకు అక్కడే ఇదే పరిస్థితి.
- హరియాణాలో ఈ నెల మూడో తేదీ నుంచి ఏడు రోజుల లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
- కర్ణాటకలో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు సీఎం యడియూరప్ప.
- తమిళనాడులోనూ మే 10 నుంచి 24 వరకూ పూర్తి లాక్డౌన్ అమలు చేయనున్నట్లు నూతన సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
- కేరళ మే 8 నుంచి 16 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.
- ఒడిశాలో ఈ నెల 5 నుంచి 19 వరకు 14 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
- రాజస్థాన్‌లో ఈ నెల 17 వరకు లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
- ఝార్ఖండ్‌లో గత నెల 22 నుంచి మే 8 వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
- ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్‌ను మే 15 వరకు పొడిగించారు.
- పంజాబ్‌లో వారాంతపు లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వంటివి ఈ నెల 15 వరకు అమల్లో ఉండనున్నాయి.
- మధ్యప్రదేశ్ ఈ నెల 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- గుజరాత్‌లోని 29 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
- మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగించింది.
- పుదుచ్చేరిలో ఈ నెల 10 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.
- బంగాల్ ప్రభుత్వం లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది.
- అసోం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
- నాగాలాండ్‌లో గత నెల 30 నుంచి ఈ నెల 14 వరకు పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
- ఉత్తరాఖండ్ రాత్రిపూట కర్ఫ్యూని మళ్లీ అమలు చేస్తోంది.
- గోవాలో మే 9 నుంచి 23 వరకు కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.