Monkey Fever in Kerala: దేశంలో మళ్లీ మంకీ ఫీవర్ భయపెడుతోంది. గత నెల కర్ణాటకలో ఓ కేసు నమోదవగా.. తాజాగా కేరళ వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకినట్లు తేలింది.
జ్వరంతో ఆస్పత్రికి చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు ఉండగా.. వైద్య పరీక్షలు చేశారు. వారు అనుకున్నదే నిజమైంది. మనంతవాడీ వైద్య కళాశాలలో బాధితుడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.
ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్ కేసు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Monkey Fever Symptoms: మంకీ ఫీవర్ దక్షిణాసియాలో కోతుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ జబ్బు. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.
ఇదీ చూడండి: 'నీట్'పై కోపం.. భాజపా ఆఫీస్‌పై పెట్రోల్ బాంబుతో దాడి