అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో కన్నడ నటి, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి భార్య రాధికా కుమార స్వామి శుక్రవారం బెంగళూరులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విచారణకు హాజరయ్యారు.
భాజపా నాయకులు, మంత్రుల పేర్లు చెప్పుకుని కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన స్వామి అలియాస్ యువరాజ్ నుంచి నగదు తీసుకున్నారనేది రాధిక ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ.
ఈ ఆరోపణలపై రాధిక ఇదివరకే వివరణ కూడా ఇచ్చారు. స్వామి తమ కుటుంబ స్నేహితుడని.. అతను 17 ఏళ్ల నుంచి తెలుసని తెలిపారు. ఓ సినిమా నిర్మాణం కోసం స్వామి అకౌంట్ నుంచి రూ.15 లక్షలు.. మరో వ్యక్తి నుంచి రూ.60 లక్షల అందినట్లు తెలిపారు.