ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. టీచర్​ అరెస్ట్ - రేప్​

Molestation case: ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో టీచర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. మార్చి 31న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు గ్రామస్థులు.

Six Year Old Girl Molested
ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులు
author img

By

Published : Apr 2, 2022, 5:16 PM IST

Molestation case: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు కామంతో కళ్లు మూసుకుపోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆరేళ్ల బాలికపై ఓ టీచర్​ లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్ఘటన జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు. స్థానికులు కూడా వీరికి మద్దతు తెలిపారు.

" మార్చి 31న ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ రోజు స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వైద్య పరీక్షలోనూ అదే నిర్ధరణ అయింది. నిందితుడిని అరెస్ట్​ చేశాం. ఐపీసీ సెక్షన్​ 376, పోక్సో చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేశాం."

- పోలీసు అధికారి

ఇదీ చూడండి: రేప్​ కేస్ నిందితుల ఇళ్లకు బుల్డోజర్లు- పరారీలో ఉన్నవారు గంటల్లోనే సరెండర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.