ETV Bharat / bharat

ఎస్​సీఓ ​సదస్సులో వర్చువల్​గా మోదీ ప్రసంగం - దుషన్​బేలో ఎస్​సీఓ సమ్మిట్​

షాంఘై సహకార సంస్థ​(ఎస్​సీఓ) కౌన్సిల్​ సమావేశానికి ఈ నెల 17న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్​ నాలుగోసారి పాల్గొంటుంది. ఎస్​సీఓ 20 వసంతాలను పూర్తి చేసుకుంది. తజికిస్థాన్​ రాజధాని దుశాన్బెలో ఈ సమ్మిట్​ నిర్వహించనున్నారు.

PM NARENDRA MODI
నరేంద్ర మోదీ
author img

By

Published : Sep 15, 2021, 4:08 PM IST

తజికిస్థాన్‌ రాజధాని దుశాన్బె వేదికగా ఈ నెల 17న షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ)​ కౌన్సిల్​​ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్​గా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్లీనరీ సెషన్‌లో ప్రసంగించనున్నారు.

ఈ సమావేశానికి తజికిస్థాన్​ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్​ అధ్యక్షత వహించనున్నారు. భారత్​ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దుశాన్బెలో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఎస్​సీఓ ఈ ఏడాదితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటుంది. మొదటిసారిగా హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఈ సమ్మిట్​ జరుగనుంది. దీనిలో పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్​ నాలుగోసారి పాల్గొంటుంది.

గత రెండేళ్లుగా ఈ ఎస్​సీఓలో వివిధ దేశాధినేతలు భవిష్యత్​ ప్రణాళికలపై చర్చించి.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి సమావేశానికి ఎస్​సీఓ సభ్యదేశాలు, తాత్కాలిక సభ్యదేశాలు, సెక్రెటరీ జనరల్​, ఎస్​సీఓలోని రీజినల్​ యాంటీ టెర్రరిస్ట్​ స్ట్రక్చర్​(ఆర్​ఏటీఎస్​)​ హాజరుకానున్నాయి.

ఇదీ చూడండి: రన్​వేపై గజరాజు హల్​చల్​- రెండు గంటల పాటు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.