ETV Bharat / bharat

8న ఆర్థికరంగ నిపుణులతో ప్రధాని భేటీ - Niti Aayog Vice Chairman Rajiv Kumar

జనవరి నెలాఖరు నుంచి బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థికరంగ నిపుణులతో భేటీ కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ఆర్థికవృద్ధిని పరుగులు పెట్టించే దిశగా బడ్జెట్​ను రూపొందించడానికి ఆర్థిక వేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Modi to interact with leading economists on Friday
8న ఆర్థికరంగ నిపుణులతో ప్రధాని భేటీ
author img

By

Published : Jan 6, 2021, 7:55 PM IST

ప్రముఖ ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ కానున్నారు. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో వృద్ధి రేటును వేగవంతం చేసే చర్యల గురించి ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి తొలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

నీతి ఆయోగ్​ వర్చువల్​గా నిర్వహించనున్న ఈ సమావేశంలో ఆ సంస్థ​ ఉపాధ్యక్షుడు రాజీవ్​ కుమార్​, సీఈఓ అమితాబ్​కాంత్​ హాజరుకానున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

ఇదీ చూడండి: 'కిసాన్ పరేడ్​కు రిహార్సల్​లా ట్రాక్టర్ ర్యాలీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.