ETV Bharat / bharat

Modi In Chhattisgarh : 'కాంగ్రెస్​ పాలనలో అవినీతి, నేరాలు బాగా పెరిగిపోయాయి'.. ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వంపై మోదీ ఫైర్​

author img

By PTI

Published : Oct 3, 2023, 3:55 PM IST

Updated : Oct 3, 2023, 5:16 PM IST

Modi In Chhattisgarh : దేశంలోని ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ కల సాకారమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో ఛత్తీస్‌గఢ్‌ పూర్తిగా వెనకబడిపోయిందని ఆరోపించారు.

Modi In Chhattisgarh
Modi In Chhattisgarh

Modi In Chhattisgarh : కాంగ్రెస్‌ పాలనలో ఛత్తీస్‌గఢ్‌ పూర్తిగా వెనకబడిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతి, నేరాలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. నేరాల సంఖ్యలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ పరస్పరం పోటీ పడుతున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో రూ. 27వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని.. బస్తర్ జిల్లాలో ఏర్పాటు సభలో పాల్గొన్నారు. భూపేశ్‌ బఘెల్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

దేశంలోని ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ కల సాకారమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సామాజిక, డిజిటల్ మౌళిక సదుపాయాలు కల్పించినప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తెలిపారు. అందుకోసమే కేంద్రప్రభుత్వం గత 9 ఏళ్లలో మౌళిక సదుపాయాల కల్పనకు రూ.10లక్షల కోట్లను కేటాయించిందన్నారు.

  • #WATCH | Chhattisgarh: At Bastar's Jagdalpur PM Modi says, "Since yesterday, Congress leaders are saying 'jitni aabadi utna haq'... I was wondering what the former Prime Minister Manmohan Singh would be thinking. He used to say that the minority has the first right to the… pic.twitter.com/m3KqCikIS4

    — ANI (@ANI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌ను చేసిన దుస్థితిని దేశమంతా చూస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల దోపిడీతో ప్రతి ఒక్కరూ విసిగిపోయారు. హత్యల్లో ఛత్తీస్‌గఢ్‌ ముందు వరుసలో ఉంది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ మధ్య పోటీ జరుగుతోందని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎక్కడ హత్యలు ఎక్కడ జరుగుతాయి..? ఎక్కడ ఎక్కువగా దోపిడీలు జరుగుతాయి..? ఎక్కడ ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరుగుతాయి..? ఛత్తీస్‌గఢ్‌లో అభివృద్ధి అంటే పోస్టర్లు లేదా బ్యానర్లలో కనిపిస్తాయి. లేకుంటే కాంగ్రెస్‌ నేతల ఖజానాలో కనిపిస్తాయి."

--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

సహజ వనరుల దోపిడీలో కాంగ్రెస్‌ పార్టీకి ట్రాక్‌ రికార్డు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ, బడ్జెట్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్‌ పార్టీ బస్తర్‌ను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నడుపుతున్నది ఆ పార్టీ నేతలు కాదని.. దేశ వ్యతిరేక శక్తులతో అనుబంధం ఉన్నవారు నడుపుతున్నారంటూ విమర్శించారు. నగర్నార్‌లో ఉక్కు పరిశ్రమ వల్ల బస్తర్‌, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 50వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. తాను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధిని వేగవంతం చేస్తాయని.. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రానికి కొత్త సంస్థలు వచ్చేలా ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఇదే వేగంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు.

  • Chhattisgarh | At Bastar's Jagdalpur PM Modi says, "These Congressmen want to make the steel plant a medium to fill the coffers of their children and relatives. But Modi will not allow this to happen because the owners of the steel plant are the people of Bastar. I will not allow… pic.twitter.com/fOVCZ2UBKG

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

PM Modi On Congress Corruption : 'అవినీతిలో మునిగిన కాంగ్రెస్.. ఆవుపేడనూ వదల్లేదు.. రేషన్​ పంపిణీలోనూ స్కామ్'

Last Updated : Oct 3, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.