ETV Bharat / bharat

Modi Bilateral Talks : దేశాధినేతలతో మోదీ బిజీబిజీ.. కెనడా ప్రధానితో 'ఖలిస్థానీ' నిరసనలపై చర్చ - జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్

Modi Bilateral Talks : జీ20 సమావేశాలకు హాజరైన పలు దేశాల అధ్యక్షులతో విడివిడిగా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఫ్రాన్స్-భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు.. కెనడాలో ఖలిస్థానీ నిరసనలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు.

Modi Bilateral Talks
Modi Bilateral Talks
author img

By PTI

Published : Sep 10, 2023, 8:29 PM IST

Modi Bilateral Talks : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ విడివిడిగా ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనాల కోసం మోదీ చర్చించారు.

భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయని ప్రధాని నరేంద్ర తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్​(ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. మరోవైపు.. ప్రపంచమంతా ఒకే కుటుంబమని మోదీతో భేటీ అనంతరం ఫ్రాన్స్​ అధ్యక్షుడు మెక్రాన్.. ట్వీట్ చేశారు. భారత్​-ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అధునాతన రక్షణ సాంకేతికత, అభివృద్ధి విషయంలో పరస్పరం పాలుపంచుకుంటామని పేర్కొన్నాయి.

ఖలిస్థానీ నిరసనలపై చర్చ..
భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అభివర్ణించారు. తమ దేశానికి భారత్​ ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్‌ వచ్చిన ట్రూడో.. ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఆయా రంగాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ సైతం ట్వీట్‌ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జస్టిన్‌ ట్రూడో.. కెనడాలో ఖలిస్థానీ నిరసనలపై చర్చించుకున్నట్లు చెప్పారు.

'జీ20 కుటుంబంలో చేరడం ఆనందంగా ఉంది'
మరోవైపు.. భారత ప్రధాని మోదీతో ఆఫ్రికన్ ఛైర్​పర్సన్​, కామొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో ఫలవంతమైన సమావేశం జరిగిందని అజాలీ అసౌమని అన్నారు. G20 కుటుంబంలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు.

  • Had a very fruitful meeting with @PR_AZALI. Congratulated him once again on @_AfricanUnion joining the G20 family. Comoros is vital to India’s SAGAR Vision. Our deliberations included ways to enhance cooperation in areas like shipping, trade and more. pic.twitter.com/Zd4Nbm7YvZ

    — Narendra Modi (@narendramodi) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'భారత్​-బ్రెజిల్ మధ్య బలమైన బంధం'
ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా జరిగిందని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తెలిపారు. భారత్​- బ్రెజిల్ మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. వ్యవసాయం, సాంకేతికత, వాణిజ్యం తదితర అంశాలపై ప్రధాని మోదీతో చర్చించానని లూలా డసిల్వా తెలిపారు.

  • Excellent meeting with President @LulaOficial. Ties between India and Brazil are very strong. We talked about ways to boost trade and cooperation in agriculture, technology and more. I also conveyed my best wishes for Brazil’s upcoming G20 Presidency. pic.twitter.com/XDMjLdfyUi

దేశాధినేతలతో చర్చలు..
ప్రధాని మోదీ.. నెదర్లాండ్స్​ ప్రధానమంత్రి మార్క్ రుట్టే, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్​ తినుబు, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్​, దక్షిణకొరియా అధ్యక్షుడు యోన్ సుక్ యోల్​. తుర్కీయే అధ్యక్షుడు ఎర్డోగాన్​లతో విడివిడిగా భేటీ అయ్యారు.

స్వదేశానికి బయలుదేరిన రిషి సునాక్ ..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్​.. భారత్​ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రెండు రోజుల భారత పర్యటన అనంతరం ఆయన స్వదేశానికి బయలుదేరారు. 'జీ20 సదస్సులో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. జీ20 అధ్యక్ష బాధ్యతలు వహించిన భారత్ అభినందనలు' అని ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా తెలిపారు.

  • Stronger together. Stronger united 🇬🇧🇮🇳

    Thank you @narendramodi for a historic G20 and the Indian people for such a warm welcome.

    From global food security to international partnerships, it’s been a busy but successful summit. pic.twitter.com/Bz1az3i2Xr

    — Rishi Sunak (@RishiSunak) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'భారత్​ మండపాన్ని సందర్శించిన మోదీ'
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జీ20 సదస్సు వేదికైన భారత్ మండపంలోని అంతర్జాతీయ మీడియా కేంద్రాన్ని సందర్శించారు. జీ20 సమావేశం ముగిసిన తర్వాత ఆయన జాతీయ, అంతర్జాతీయ విలేకరులకు అభివాదం చేశారు.

G20 Summit 2023 Delhi : 'సవాళ్ల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం!'.. భారత్​ జీ20 ప్రెసిడెన్సీపై ప్రపంచ దేశాలు సంతృప్తి

G20 Closing Ceremony 2023 : బ్రెజిల్ చేతికి జీ20 పగ్గాలు.. సంస్కృత శ్లోకం చదివి, సుత్తి అప్పగించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.