ఒడిశా కటక్‌లోని మహానదిలో చిక్కుకున్న ఏనుగును కాపాడేందుకు వెళ్లిన విపత్తు స్పందన దళానికి (ఓడీఆర్ఏఎఫ్) చెందిన పడవ నీటిలో మునిగిపోయింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా.. సహాయక సిబ్బంది సహా మీడియాకు చెందిన మరో ఇద్దరు అందులో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న ఇతర విపత్తు దళ సిబ్బంది.. తాళ్ల సాయంతో వారిని బయటకు తీశారు. కటక్‌లోని ఆస్పత్రులకు తరలించారు.
దురదృష్టవశాత్తు.. ఓ పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయారు.
11 ఏనుగులు నది దాటుతుండగా..
నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనే.. 11 ఏనుగుల గుంపు మహానది దాటేందుకు ప్రయత్నించాయి. 10 ఏనుగులు ఎలాగోలా అవతలి ఒడ్డుకు చేరగా.. ఒకటి మాత్రం ముండాలి బ్రిడ్జ్ వద్ద చిక్కుకుపోయింది. కాపాడేందుకు విపత్తు నిర్వహణా బృందాలు ప్రయత్నించగా.. పడవ మునిగిపోయింది.
ఇవీ చూడండి: పట్టపగలే కోర్టులో కాల్పులు.. ముగ్గురు మృతి