ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. గ్రాఫిటీ (గోడలపై చిత్రాలు) వేశారు. కర్ణాటక మంగళూరులోని ఓ అపార్ట్మెంట్ గోడలపై అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారు. కద్రి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇది జరగడం గమనార్హం. "ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు లష్కరే తోయిబా, తాలిబన్లను ఒక్కటి చేసేలా మాపై ఒత్తిడి పెంచొద్దు" అని గోడలపై రాసి ఉంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ గ్రాఫిటీ వేసిన గోడలపై కవర్లు కప్పి ఉంచారు.

ఇదీ చూడండి: పండగ సీజన్లో ఆన్లైన్ విక్రయాలు భళా