ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన మైనర్​- డీఎన్​ఏ పరీక్షకు ఏడుగురు! - డీఎన్​ఏ టెస్ట్​కు మైనర్​ బిడ్డ

ఉత్తర్​ ప్రదేశ్​లో ఓ మైనర్​ ఇటీవలే శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత.. బిడ్డకు తండ్రి ఎవరు అనేది తెలుసుకోవడానికి.. ఏడుగురికి డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. వీరంతా మైనర్​పై సామాహిక అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Minor rape victim delivers child
బిడ్డకు జన్మనిచ్చిన మైనర్​
author img

By

Published : Aug 21, 2021, 4:28 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకిలోని అసాంద్ర గ్రామానికి చెందిన ఓ మైనర్ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయంపై బాలిక నాన్న ఏడుగురి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారంత తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపించాడు. ఈ ఏడుగురిలో బాధితురాలి భర్త కూడా ఉండడం గమనార్హం.

ఇదీ జరిగింది..

రెండు నెలల క్రితం.. గ్రామంలోని ఓ బాలిక అత్యాచారానికి గురైంది. అనంతరం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె వివాహం జరిగింది. ఆ యువకుడే అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే తన కుమారుడు అమాయకుడని ఆ యువకుడి తల్లి చెప్పుకొచ్చింది. బాధితురాలి కుటుంబసభ్యులు తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. మైనర్​ తండ్రి, ఇతరులు కలిసి ఒత్తిడి తెచ్చి డెలివరికి సంబంధించిన ఖర్చులతో సహా రూ.6 లక్షల నగదును, ప్రతి నెల రూ. 3000ను తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకుని న్యాయం చేయాలని వేడుకుంది.

బాధితురాలి తండ్రి వాదన ఇలా...

యువకుడి తల్లి, బాలిక తండ్రి వాదనలు చాలా భిన్నంగా ఉన్నాయి. గ్రామంలోని ఓ పెద్ద మనిషి సాయంతో తన కుమార్తెను నిందితుడు వివాహం చేసుకున్నట్లు.. ఆగస్టు 16న అసాంద్ర పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తన కూతురు దాదాపు ఏడు నెలల పాటు నిందితుడి ఇంట్లోనే ఉందని చెప్పాడు. ఈ సమయంలోనే ఆ యువకుడితో పాటు మరి కొందరు సామూహిక అత్యాచారం చేయడం వల్ల గర్భవతి అయినట్లు ఆరోపించాడు. అబార్షన్​ చేయించడానికి ప్రయత్నించారని, లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

డీఎన్​ఏ పరీక్షలు...

సామూహిక అత్యాచారానికి గురైన మైనర్​ తండ్రి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు బారాబంకి సర్కిల్​ ఆఫీసర్​ పంకజ్​ సింగ్​ తెలిపారు. బాధితురాలు బిడ్డకు జన్మనివ్వడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని వివరించారు. ఆ శిశువుకు తండ్రి ఎవరు అని తెలుసుకోవడం కోసం నిందితులందరికీ డీఎన్​ఏ పరీక్ష చేయిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తాలిబన్లలకు మద్దతుగా పోస్టులు.. 14 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.