వైద్యులపై..14 ఏళ్ల బాలుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి మృతికి వారే కారణమని ఆరోపించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించి.. తన తండ్రిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన వ్యక్తిని.. తిరిగి తీసుకురాగలరా అంటు వైద్యులను ప్రశ్నించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన జరిగింది. బాధతో ఏడుస్తూ.. డాక్టర్లను, బాలుడు ప్రశ్నిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆదర్శ్ పాండే అనే బాలుడు.. వైద్యుల నిర్లక్ష్యంపై ఈ తరహాలో ఆవేదన వ్యక్తం చేశాడు. బాలుడు తండ్రి.. రామచంద్ర పాండే చాలా రోజుల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి రామచంద్ర పాండేను జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కానీ సోమవారం ఉదయం వరకు ఏ డాక్టర్.. తన తండ్రిని చూసేందుకు రాలేదని బాలుడు చెబుతున్నాడు. 'మా నాన్న చనిపోయే 10 నిమిషాల ముందు డాక్టర్లు వచ్చారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని చెప్పారు. వెంటనే లఖ్‌నవూకు తీసుకెళ్లాలని చెప్పారు. పది నిమిషాల్లో మా నాన్నని లఖ్‌నవూకు ఎలా తీసుకెళ్లగలం. లఖింపుర్ ఖేరి నుంచి లఖ్‌నవూకు 10 నిమిషాల్లో వెళ్లే ట్రైన్ ఏమైనా ఉందా.' అని బాలుడు వైద్యులను ప్రశ్నించాడు.
అంతకు ముందు రామచంద్ర పాండేను ఇదే ఆసుపత్రిలో చేర్పించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు వైద్యం చేసినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడని కారణంగా.. దిల్లీకి వెళ్లమని సూచించారన్నారు. రామచంద్రను వెంటనే దిల్లీకి తీసుకెళ్లామని తెలిపారు. అక్కడి డాక్టర్లు వైద్యం చేసిన అనంతరం.. పరిస్థితి బాగానే ఉందని మళ్లీ లఖింపుర్ ఖేరీ పంపించారని వెల్లడించారు. మళ్లీ రామచంద్ర అనారోగ్యం బారిన పడ్డారని.. అందుకే లఖింపుర్ ఖేరీ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చామని తెలిపారు. కానీ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా రామచంద్ర పాండే చనిపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
'అన్నం అడిగితే అమ్మ కొడుతోంది సార్'.. బాలుడి ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారంటే?
కొన్నాళ్ల క్రితం 'అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్' అంటూ తల్లిపై ఫిర్యాదుతో పోలీస్‌స్టేషనుకు వచ్చిన 8 ఏళ్ల బాలుడిని చూసి బిహార్ పోలీసులు విస్తుపోయారు. ఓ మార్కెట్ వీధి సిటీ పోలీసుల ముందు నిలుచుని, ఏడుస్తూ తన బాధను చెప్పాడు బాలుడు. దీంతో ఆ చిన్నారిని చూసి ఏమిచేయాలో కాసేపు పోలీసులకు పాలు పోలేదు. ముందుగా కడుపు నిండా అన్నం పెట్టారు. తర్వాత.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి