ETV Bharat / bharat

మందు కొట్టిన పిల్లలు.. పరిస్థితి విషమం.. పెద్దల్ని చూసి నేర్చుకుని... - ఆల్కహాల్ తాగిన పిల్లలు

Minor Alcohol Consumption: పిల్లలు ఎప్పుడూ పెద్దలను అనుసరిస్తుంటారు. మంచైనా.. చెడైనా.. ఆ పనులనే చేస్తుంటారు. మధ్యప్రదేశ్​లో పెద్దలు ఆల్కహాల్ తాగడం చూసి పిల్లలు కూడా మద్యం సేవించారు. పరిమితికి మించి తాగి ఆస్పత్రి పాలయ్యారు.

Children drink alcohol in Chhatarpur
ఆల్కహాల్​
author img

By

Published : Mar 28, 2022, 12:51 PM IST

Minor Alcohol Consumption: మధ్యప్రదేశ్​లోని ఛతార్​పుర్​ జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దలు ఆల్కహాల్ తాగుతుంటే చూసి పిల్లలు కూడా మద్యాన్ని సేవించారు. అయితే.. పరిమితికి మించి మందు తాగడం వల్ల ఆస్పత్రి పాలయ్యారు.

నౌగాన్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్రి గ్రామంలో రాజుకు పన్నేండేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పటికే పెద్దలు మందు కొట్టడం చూసిన ఆ బాలుడు.. స్నేహితులతో కలిసి ఆల్కహాల్ బాటిల్ తీసుకుని పొలాల్లోకి వెళ్లాడు. రాజు కుమారుడు పరిమితికి మించి ఆల్కహాల్​ తీసుకుని అక్కడే పడిపోయాడు. అయితే.. తక్కువ మద్యాన్ని తాగిన ఓ బాలుడు ఇంటికి వచ్చి విషయం తెలిపాడు. తల్లిదండ్రులు వెంటనే వెళ్లి ఆ బాలుడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించగా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ చదవండి: భాజపా తరఫున ప్రచారం.. ముస్లిం యువకుడ్ని కొట్టి చంపిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.