ETV Bharat / bharat

వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు - మధ్యప్రదేశ్​ మంత్రి ఉషా ఠాకూర్

కరోనా నుంచి విముక్తి కలిగించాలని పూజలు చేశారు మధ్యప్రదేశ్​ మంత్రి ఉషా ఠాకూర్. ఆమె గతంలో వైరస్​ వ్యాప్తి కట్టడికి మాస్కులు ధరించనవసరం లేదని.. యజ్ఞాలు చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు.

MINISTER USHA THAKUR WORSHIPPED GODDESS AHILYABAI IN INDORE
వైరల్: కరోనా నివారణకు మంత్రి పూజలు
author img

By

Published : Apr 10, 2021, 7:53 PM IST

కరోనా నివారణపై గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక మంత్రి ఉషా ఠాకూర్.​. తాజాగా వైరస్​ నుంచి విముక్తి కోసం పూజలు చేశారు. ఇందోర్​ విమానాశ్రయంలో దేవీ అహిల్య భాయి హోల్కర్​కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి కీర్తనలు పాడుతూ, భజన చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్​పోర్ట్​ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

పూజలు చేస్తున్న మంత్రి ఉషా ఠాకూర్

కొవిడ్​ నుంచి రక్షణగా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉషా ఠాకూర్. బదులుగా యజ్ఞాలు, హిందూ వేద పద్ధతులను అవలంబించాలని పిలునివ్వడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.