ETV Bharat / bharat

మహబూబ్‌నగర్‌పై శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ గురి - కట్టడికి పూనుకున్న విపక్ష కూటములు - మహబూబ్ నగర్ రాజకీయ పార్టీల వ్యూహం

Srinivas Goud Is Trying For Hattrick Win in Mahbubnagar : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు.. హ్యాట్రిక్ దక్కుతుందా..? ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందా..? లేదంటే కమలం విరబూస్తుందా..? మహబూబ్‌నగర్ నియోజకవర్గంపై ఓటర్లను తొలచి వేస్తున్న ప్రశ్నలివి. పదేళ్ల ప్రగతిని.. బీఆర్ఎస్ నమ్ముకుంటే.. మంత్రి తీరును ఎండగడుతూ కాంగ్రెస్ ముందుకెళ్తోంది. సమగ్ర ప్రగతి నినాదంతో బీజేపీ ప్రచారం చేస్తోంది. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక కథనం.

Mahabubnagar Political Parties Strategy
Congress Efforts to bind Minister Srinivas Goud
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 8:03 AM IST

మహబూబ్‌నగర్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ గురి - కట్టడికి పూనుకున్న విపక్ష కూటములు

Congress Efforts to bind Minister Srinivas Goud : ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహబూబ్‌నగర్. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయదుందుభి మోగించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.. హ్యాట్రిక్‌ విజయం దక్కించుకునే దిశగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. పదేళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధినే ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు. కేసీఆర్‌ అర్బన్ ఎకో పార్క్, ఐటీ పార్క్, అమర్‌రాజా పరిశ్రమ(Amar raja Industry), 1000 పడకల ఆసుపత్రి, శిల్పారామం, మినిట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్డు, తీగలవంతెన, కూడళ్ల సుందరీకరణ, నిరంతర తాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి పనులను ప్రజలకు వివరిస్తున్నారు.

BRS Aiming for Hattrick Telangana 2023 : ఓవైపు హ్యాట్రిక్​పై కేసీఆర్ ఫోకస్​.. మరోవైపు మహబూబ్​నగర్​లో మూడోసారి గెలుపుపై కన్నేసిన ఎమ్మెల్యేలు

మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో.. కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. అభ్యర్ధి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి.. ఆరు గ్యారంటీలతోపాటు, మంత్రి వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఆరాచకాలు, అక్రమ కేసులకు చరమగీతం పాడాలంటే హస్తానికి ఓటు వేయాలని కోరుతున్నారు. మహబూబ్ నగర్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడానికి తామంతా ఇక్కడ పూనుకున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల హక్కులను ధ్వంసం చేస్తున్న వారిపై యుద్ధంగా అసెంబ్లీ ఎన్నికలను సంబోధించారు.

Mahabubnagar Political Parties Strategy : బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి.. అమృత్ సిటీ కింద మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేళ్ల అభివృద్ధి శ్రీనివాస్‌గౌడ్‌కు బలమైతే.. ఆయనపై వస్తున్న ఆరోపణలు ప్రతికూల అంశాలుగా మారాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు(Congress Six Guarantee), ఎమ్మెల్యేగా గతంలో చేసిన సేవలు.. యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి సానుకూలం కాగా.. ఎన్నికలప్పుడు తప్ప మళ్లీ కనిపించరన్న విమర్శ ప్రతికూలంగా మారింది.

Political War in Mahabubnagar : ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి పాలమూరు రాజకీయాలు.. అలంపూర్​లో బీఆర్​ఎస్​ ప్లాన్​ ఏంటి..?

తన తండ్రైన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మద్దతు, యవకుడనే అంశాలు బీజేపీ అభ్యర్ధి మిథున్‌రెడ్డికి బలమైతే.. ఇద్దరు ఉద్దండులను ఎదుర్కొని నిలబడటం సవాలుగా మారనుంది. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 2 లక్షల 52వేల ఓటర్లుండగా అందులో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. మొత్తం ఓట్లలో.. బీసీ, మైనారిటీలు కలిపి లక్షా 30వేలకుపైగా ఓట్లుంటాయి. బీసీల్లో ముదిరాజ్, యాదవుల ఓట్లు సహా ముస్లింల(Muslim Community) ఓట్లు కీలకం.

Telangana Assembly Elections 2023 : మహబూబ్‌నగర్‌ పట్టణ ఓట్లు ప్రధాన పార్టీలు పంచుకున్నా.. మహబూబ్‌నగర్‌ గ్రామీణం, హన్వాడ మండల ఓట్లు అభ్యర్థులకు కీలకంగా మారతాయి. ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ఉండగా.. 2019 పార్లమెంటు ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించిన బీజేపీ సైతం.. ఈసారి సత్తా చాటే అవకాశముంది. పాలమూరు ప్రజలు.. పదేళ్ల అధికార పార్టీ ప్రగతికి పట్టం కడతారా..? మంత్రిని ఇంటికి పంపాలన్న పిలుపును అందుకుని కాంగ్రెస్‌ను గెలిపిస్తారా..? ఇద్దరినీ కాదని.. యువకునికి అవకాశం కల్పిస్తారా వేచి చూడాల్సిందే.

Mahabubnagar Assembly Poll : పాలమూరులో హ్యాట్రిక్ కోసం BRS.. మరో ఛాన్స్ అంటున్న కాంగ్రెస్.. బోణీ కొట్టేందుకు BJP రెడీ

PM Modi Telangana Tour Schedule : అక్టోబర్1న పాలమూరుకు, 3న నిజామాబాద్​కు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.