ETV Bharat / bharat

లేబర్​ మంత్రి కుమారుడికి బంట్రోతు ఉద్యోగం- వెయిటింగ్ లిస్ట్​లో మేనల్లుడి పేరు- ఇదేంటి అంటున్న రాష్ట్ర ప్రజలు! - ప్యూన్​ ఉద్యోగిగా మంత్రి కుమారుడు

Minister Son Get Peon Job In Jharkhand : ఓ మంత్రి కుమారుడు జిల్లా సివిల్​ కోర్ట్​లో ప్యూన్​ ఉద్యోగిగా ఎంపికయ్యాడు. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పించాల్సిన మంత్రి, తన కుమారుడికి నాలుగో తరగతి ఉద్యోగిగా ఎంపిక చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Minister Son Get Peon Job In Jharkhand
Minister Son Get Peon Job In Jharkhand
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 3:14 PM IST

Updated : Dec 2, 2023, 8:16 PM IST

Minister Son Get Peon Job In Jharkhand : ఝార్ఖండ్​కు చెందిన లేబర్ ప్లానింగ్ ప్లానింగ్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్​మెంట్ మంత్రి కుమారుడు సివిల్​ కోర్టులో బంట్రోతు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అలానే ఆ మంత్రి మేనల్లుడు పేరు సైతం వెయిటింగ్ లిస్ట్​లో ఉంది. నాలుగో తరగతి అయిన బంట్రోతు ఉద్యోగానికి, ఓ మంత్రి కుమారుడు ఎంపిక కావటం వల్ల జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం చతరా జిల్లా సివిల్​ కోర్ట్​ నాలుగో తరగతి ఉద్యోగాల నియామక ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మొత్తం 19 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే ఈ లిస్ట్​లో ఝార్ఖండ్​ లైబర్​ ప్లానింగ్, ట్రైనింగ్ అండ్ స్కిల్​ డెలవప్​మెంట్ మంత్రి సత్యానంద్​ భోక్తా కుమారుడు ముఖేశ్ కుమార్ భోక్తా పేరు కూడా ఉంది. అయితే మంత్రి కుమారుడిని నాలుగో తరగతి ఉద్యోగమైన బంట్రోతుగా ఎంపిక చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన మంత్రి, ఇప్పుడు కుమారుడికి బంట్రోతుగా ఉద్యోగం ఇప్పిస్తారా అని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మఖేశ్​ కుమార్​కు గత ఏడాది డిసెంబర్​లోనే వివాహం జరిగింది.

Minister Son Get Peon Job In Jharkhand
ప్యూన్​ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్ధుల లిస్ట్​లో మంత్రి కొడుకు పేరు

ఆర్​జేడీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా.. సత్యానంద్​ భోక్తా చతరా నుంచి ఆర్​జేడీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశేషం ఏంటంటే ఝార్ఖండ్​​ నుంచి ఆర్​జేడీ తరపున ఏకైక ఎమ్మెల్యే కూడా సత్యానంద్​ భోక్తా. 2000 సంవత్సరంలో తొలిసారిగా బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి.. అప్పటి ఆర్​జేడీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో బీజేపీ నుంచి టికెట్​ ఇవ్వకపోవటం వల్ల పార్టీకి నుంచి బయటకు వచ్చేసి ఆర్​జేడీలో చేరారు. 2019లో ఆర్​జేడీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఝార్ఖండ్​లో ఏర్పాటైన హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో సత్యానంద్​ భోక్తాకు మంత్రి పదవి వచ్చింది. ప్రస్తుతం లేబర్​ ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్​ అండ్ స్కిల్​ డెవలప్​మెంట్​ మంత్రిగా సత్యానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్యూన్ కాళ్లు మొక్కిన జిల్లా కలెక్టర్​.. ట్రాన్స్​ఫర్​పై వెళ్తూ.. తనకు సేవ చేశారని..

ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు రెండు ఐటీ కంపెనీలకు బాస్.. రూ.కోట్ల టర్నోవర్!

Last Updated : Dec 2, 2023, 8:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.