ETV Bharat / bharat

దేశంలో భారీ దాడులకు ఉగ్రకుట్ర.. ఆ భక్తులే టార్గెట్.. హోంశాఖ హైఅలర్ట్! - అల్​ఖైదా దాడులు ఇండియా

దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్​ఖైదా కుట్ర పన్నుతోంది. అమర్​నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు ప్రణాళికలు రచిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ.. అధికారులను అలర్ట్ చేసింది.

Terrorists planning to attack religious pilgrimages

author img

By

Published : Jun 27, 2022, 10:53 PM IST

Terrorists attack plan India: పాకిస్థాన్​కు చెందిన ముష్కర ముఠాలు భారత్​పై దాడులకు కుట్రలు పన్నుతున్నాయి. మతపరమైన స్థలాలపై, భద్రతా దళాలపై దాడులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్​ఖైదా ఇండియన్ సబ్​కాంటినెంట్ (ఏక్యూఐఎస్) విభాగం భారీ దాడులకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అమర్​నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది. మతపరమైన ప్రదేశాల వద్ద అదనపు భద్రత కల్పించాలని, పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేసింది. భారతదేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలన్నింటినీ భగ్నం చేయాలని సూచించింది.

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ గుజ్జర్​ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నెల ప్రారంభంలో కిష్టావర్ జిల్లాలో ఆర్మీ, కశ్మీర్​ పోలీసులు కలిసి.. గుజ్జర్​ను అరెస్టు చేశారు. జమ్ము కశ్మీర్​లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు గుజ్జర్ ప్రయత్నిస్తున్నట్లు ఓ ఇంటెలిజెన్స్ అధికారి.. 'ఈటీవీ భారత్​'తో చెప్పారు. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్​లో గతవారం ఎన్​ఐఏ భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించింది. 14 ప్రాంతాల్లో సోదాలు చేసింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన బేస్​ను పెంచుకునేందుకు అల్​ఖైదా ఇండియన్ సబ్​కాంటినెంట్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జమ్ము కశ్మీర్​, ఈశాన్య భారతదేశంలో యాక్టివ్​గా ఉంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మధ్యభారతంలోనూ ఈ ఉగ్రమూకల ఆనవాళ్లు ఉన్నాయి. కాగా, 43 రోజుల పాటు సాగే అమర్​నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇప్పటికే అమర్​నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. 300 కంపెనీల పారమిలిటరీ దళాలను మోహరించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.