కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించడంపై ఉన్నతస్థాయి కమిటీ మే 2వ తేదీ తర్వాత సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేంద్రం.
"కమిటీలో సభ్యుడయ్యే కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరీతో ఈ విషయంపై చర్చించాం. ఆయన మే 2వ తేదీ వరకు అందుబాటులో ఉండనని చెప్పారు" అని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది.
ఈ ఉన్నత స్థాయి కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.
ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్ వ్యవస్థ