కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా ముగ్గురు పేర్లను సోమవారం షార్ట్‌లిస్ట్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ. ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీ, ఎస్ఎస్బీ డీజీ కుమార్ రాజేశ్ చంద్ర, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అవస్థీ.. యూపీ క్యాడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీబీఐ సంయుక్త డైరెక్టర్ సహా ఇతర ఉన్నత స్థాయుల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం యూపీ డీజీగా ఉన్నారు.
రాజేశ్ చంద్ర.. బిహార్ క్యాడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. కాగా, కౌమిది.. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
ఈ కమిటీలో ప్రధానితో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ, లోక్‌సభలో విపక్షనేత అధీర్ రంజన్ చౌదరీ ఉన్నారు. దిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది.
ఇదీ చదవండి- బంగాల్ హింసపై సీజేఐకి మహిళా న్యాయవాదుల లేఖ