ETV Bharat / bharat

యుద్ధ రంగంలో శివంగిలా.. యువతకు ఆదర్శంగా - యుద్ధ రంగంలో శివంగిలా

చరిత్రను మార్చాలంటే చరిత్ర సృష్టించాల్సిందే. అలా చరిత్రను సృష్టించిన వీరనారి.. శివాంగి స్వరూప్‌. కదనరంగంలో పోరాటానికి మహిళలు పనికిరారన్న నిబంధనలను కూకటివేళ్లతో సహా పెకిలించిన ధీరవనిత ఆమె. దేశ రక్షణలో కీలకమైన నౌకాదళంలో తొలి మహిళా ఫైలెట్‌గా ఎంపికై గాల్లో శివంగిలా దూసుకుపోతోంది. యుద్ధ విమానం నడపాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉక్కు సంకల్పంతో, సడలని పట్టుదలతో శివాంగి చేసిన పయనం ఎందరికో స్ఫూర్తి దాయకం. యువతకు మార్గదర్శనం.

Shivangi
యుద్ధ రంగంలో శివంగిలా.. యువతకు ఆదర్శంగా
author img

By

Published : Mar 8, 2021, 7:00 AM IST

ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు ఎంతోమందికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆమెకూ అంతే. గాల్లో చక్కర్లు కొట్టిన గాలిమోటార్‌ ఆమెకూ ఎగరాలన్న కోరికను పెంచింది. లక్ష్యాన్ని మార్చుకొని పైలట్‌ కావాలన్న కాంక్షను బలపరిచింది. ఆమే బిహార్‌కు చెందిన సబ్‌ లెఫ్టినెంట్‌.. శివాంగి స్వరూప్.. భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్‌గా చరిత్రకెక్కిన ధీర వనిత.

Shivangi
యుద్ధ రంగంలో శివంగిలా

బిహార్‌ ముజఫర్‌పుర్‌లోని ఫతేహాబాద్‌కు చెందిన శివాంగికి ఆకాశంలో ఎగరాలనే కోరిక చిన్నప్పుడే ఉదయించింది. కిరణ్‌ బేడిని చూసి ఒక్కసారైనా అలా యూనిఫాం ధరించాలని కలగనేది. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్లు ఆమెకు లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఎగరాలన్న కోరికను పెంచాయి. శివాంగి వాళ్ల తాతయ్య ఊరెళ్లినప్పుడు ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్‌లో రాష్ట్ర మంత్రి ఒకరు వచ్చారు. మంత్రి వచ్చిన హెలికాప్టర్‌ ఆకాశం నుంచి కిందికి దిగుతుంటే శివాంగి ఆశ్చర్యపోయారు. ఆ సంఘటనతో జీవితంలో ఒక్కసారైనా గాల్లో ఎగరాలని, విమానం నడపాలనే కోరిక ఆమెలో బలంగా నాటుకుపోయింది.

Shivangi
యుద్ధ విమానంలో శివాంగి

శివాంగి ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి హరిభూషన్‌ సింగ్ పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి సాధారణ గృహిణి. సిక్కిం, మణిపాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు శివాంగి. జయపురలోని నిట్‌లో ఎంటెక్‌ చేశారు. కొద్ది నెలలకే నౌకాదళంలో అవకాశం రావడం వల్ల దాన్ని మధ్యలోనే ఆపేశారు. శివాంగి ఇండియన్‌ నావల్‌ అకాడమీ 2018లో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. చిన్ననాటి కలను సాకారం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు.

Shivangi
శివాంగి

అనంతరం కొచ్చిలోని దక్షిణ నావల్‌ కమాండ్‌ కేంద్రంలో చేరారు. అక్కడ ఎన్​ఓసీ కోర్సులో చేరిన శివాంగి యుద్ధవిమానాలు నడపటంలో కఠినమైన తర్ఫీదు పొందారు. శిక్షణలో డోర్నియర్‌ ఎయిర్‌ క్రాప్ట్‌ను ఆమె విజయవంతంగా నడిపారు. గతేడాది డిసెంబరులో శిక్షణ పూర్తి చేసిన శివాంగి.. సబ్‌ లెప్టినెంట్‌ హోదాలో నౌకాదళ వైమానిక విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆమె వాయు రవాణా వ్యవస్థను నియంత్రించడంతో పాటు యుద్ధ విమానాల్లో ఆయుధాలు, సమాచార విశ్లేషణ విభాగానికి బాధ్యత వహిస్తున్నారు.

"కొచ్చిలో పొందిన శిక్షణ నా సామర్థ్యాలను తెలుసుకోవడానికి, ఆలోచనా విధానం మార్చుకోవడానికి ఉపయోగపడింది. మనం ఏదైనా అనుకుంటే తప్పకుండా దాన్ని చేరుకుంటాం. నిరాశలో కూరుకుపోతే ముందుకు సాగలేం. క్లిష్ట పరిస్థితుల్లోనూ నా బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చగలనన్న నమ్మకం నాకుంది. నా పయనంలో ఎదురైన కష్టాలు.. లక్ష్యంపై ఉన్న అంకితభావమే ఈ స్థాయికి చేర్చాయి."

- శివాంగి, భారత నౌకాదళంలో తొలి మహిళా పైలెట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.