ETV Bharat / bharat

ఆర్య.. రాజకీయాల్లో యువశక్తి.. ఎందరికో స్ఫూర్తి - మేయర్ ఆర్య రాజేంద్రన్

ఒక్కోసారి చరిత్ర సృష్టించడానికి అహర్నిశలు శ్రమించాల్సి వస్తుంది. మరికొన్ని సార్లు ఆ చరిత్రే వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి కథే తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్‌ది. దేశం ఏమవుతున్నా ఆరంకెల జీతం తప్ప రాజకీయాల గురించి పట్టని స్థితిలోకి యువత మళ్లిన వేళ 21 ఏళ్ల ఆర్య మాత్రం రాజకీయ యవనికపై కొత్త గమనానికి నాంది పలికారు. గత డిసెంబర్ వరకూ డిగ్రీ చదువుతూ విద్యార్థి నాయకురాలుగా ఉన్న ఆమె.. ఇప్పుడు తిరువనంతపురానికే మార్గదర్శిగా మారి మొత్తం యువలోకానికే స్ఫూర్తిగా నిలిచారు.

Arya Rajendran
ఆర్య.. రాజకీయాల్లో యవశక్తి.. ఎందరికో స్ఫూర్తి
author img

By

Published : Mar 8, 2021, 8:01 AM IST

ఆర్య రాజేంద్రన్‌...! తిరువనంతపురం మేయర్‌ ..! దేశంలోనే అతి చిన్న వయసులోనే ఓ నగర మేయర్ పదవి చేపట్టి యువతలో స్ఫూర్తి నింపిన వ్యక్తి. వయస్సు 21 ఏళ్లు. చదువుతున్నది డిగ్రీ రెండో సంవత్సరం. తన కుటుంబానికి ఏ విధమైన రాజకీయ చరిత్ర లేదు. స్థితిమంతులూ కాదు. అయితేనేం వీటన్నింటిని అధిగమించిన ఆర్య రాజేంద్రన్‌ రాజకీయాలను ఈసడించుకుంటున్న నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.

చిన్ననాటి నుంచే..

ఆర్య తండ్రి రాజేంద్రన్‌ ఎలక్ట్రీషియన్‌. తల్లి శ్రీలత ఎల్​ఐసీ ఏజెంట్‌. ఆరేళ్ల వయసులోనే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే బాలసంఘంలో ఆర్య చేరారు. ఆసియాలోనే అత్యధికమంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ఆర్యలో స్వతంత్ర భావాలను ఇనుమడించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే కళాశాలలో విద్యార్థి నాయకురాలుగా ఎదిగారు. మరోవైపు బాలసంఘం తరఫున కూడా చురుగ్గా సేవలందిస్తుండటంతో సీపీఎమ్.. ఈమెను బాలసంఘానికి కేరళ అధ్యక్షురాలిగా నియమించింది. ఆర్య దృష్టి గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులపై పడింది. వారిని బృందాలుగా తయారుచేసి గ్రామీణ సమస్యలపై పోరాడేలా ఆమె కృషి చేశారు. గ్రామాభివృద్ధి అంశాలను పాలకుల ఎదుట ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేలా వారిలో ఉత్సాహం, ధైర్యాన్ని తీసుకురాగలిగారు.

తిరువనంతపురంలోని ఆల్‌ సెయింట్స్‌ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్య అభివృద్ధికి బాటలు వేయాలంటే రాజకీయాలే సరైన వేదిక అని భావించారు. గతేడాది జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ముదవన్‌ ముక్కల్‌ వార్డుకు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

కదిలివచ్చిన మేయర్..

ప్రచారంలో భాగంగా అనేక అభివృద్ధి విషయాలతో నగర సమస్యలపై దృష్టిసారించిన ఆర్య తాను మేయర్‌ అయితే వ్యర్థాలు లేని అందమైన మహా నగరంగా తిరువనంతపురాన్ని తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అందరికీ ఆరోగ్యం అందాలనేది తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆమె ఎంచుకున్న అభివృద్ధి అంశాలు నచ్చడం వల్ల ఆర్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండువేలకు పైగా ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయాన్ని సాధించిన ఆర్యను వెతుక్కుంటూ.. ఏకంగా తిరువనంతపురం మేయర్ పీఠం కదిలి వచ్చింది. రాజకీయాలను ఈసడించుకుంటున్న ఎంతో మంది యువతకు ఆర్య కథ ఓ మేలుకొలుపు అనడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.