ETV Bharat / bharat

ఆ బాలుడికి గుర్రమే స్కూల్​ బస్- రోజూ 20 కిలోమీటర్ల సవారీ

కొందరు పిల్లలు బడికి ఆటోలో వెళ్తారు. మరికొందరు బస్సులో వెళ్తుంటారు. కానీ ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ బాలుడు మాత్రం పాఠశాలకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఎంచుకున్నాడు.

boy  rides horse daily to reach school
గుర్రంపై బడికి వెళ్తున్న బాలుడు
author img

By

Published : Oct 4, 2021, 4:08 PM IST

గుర్రంపై స్వారీ చేస్తూ.. పాఠశాలకు వెళ్తున్న బాలుడు

'మనసుంటే మార్గముంటుంది' అని రుజువు చేశాడు ఛత్తీస్​గఢ్​​కు చెందిన 12 ఏళ్ల బాలుడు. చదువుపై తనకున్న మక్కువతో ఎలాగైనా పాఠశాలకు వెళ్లాలని ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన ఇంటి నుంచి పాఠశాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గుర్రంపై వెళ్తున్నాడు.

బిలాస్‌పుర్‌కు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న బెల్గహనాలోని జర్గా గ్రామానికి చెందిన మనీశ్​ యాదవ్​.. ఐదో తరగతి చదువుతున్నాడు. ఊరిలో బడి లేకపోవడం వల్ల చదువుకోవడానికి 10 కిలోమీటర్లు వెళ్లాలి. ఆ ఊరికి బస్సులు, ఆటోలు వంటి వాహనాలు వెళ్లవు. దీంతో ఎలాగైనా స్కూల్​కు వెళ్లాలని.. గుర్రపు స్వారీ మొదలుపెట్టాడు మనీశ్​.

boy  rides horse daily to reach school
గుర్రంపై పాఠశాలకు వెళ్తున్న బాలుడు

యాదవ్.. రోజూ గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తాడు. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి బెల్గహనాలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తాడు. ఈ క్రమంలోనే గుర్రపు స్వారీని ఆస్వాదిస్తానని మనీశ్​ చెబుతున్నాడు. ఈ బాలుడికి చదువుపై ఉన్న మక్కువను చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు.

యాదవ్​కు చదువంటే ఎంతో ఇష్టమని.. అదే ఆ బాలుడ్ని విజయవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుందని.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేలా చేస్తుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లే పిల్లలు చాలా మంది ఉన్నారని.. అయితే రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. వర్షాకాలంలో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా.. పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చూడండి: 'దహీ కచోరి'తో రాత్రికి రాత్రే 14 ఏళ్ల బాలుడు ఫేమస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.