ETV Bharat / bharat

'ఆపత్కాలంలో భారత్​కు సాయంగా 40 దేశాలు' - ఆక్సిజన్ కొరత భారత్​లో

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్, రెమ్​డెసివిర్ లాంటి అత్యవసర ఔషధాలను సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో వివిధ ఫార్మా సంస్థల నుంచి 7లక్షలకు పైగా రెమ్​డెసివిర్ డోసులు, ముడి పదార్థాలు భారత్​కు రానున్నాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్​ శ్రింగ్లా తెలిపారు.

MEA
హర్షవర్ధన్​ షింగ్లా
author img

By

Published : Apr 30, 2021, 6:34 AM IST

దేశంలో కొరత నెలకొన్న ఆక్సిజన్, ఇతర అత్యవసర ఔషధాలపై కీలక ప్రకటన చేశారు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా. రానున్న రోజుల్లో వివిధ ఫార్మా సంస్థల నుంచి 7లక్షలకు పైగా రెమ్​డెసివిర్ డోసులు, ముడి పదార్థాలు భారత్​కు రానున్నాయని స్పష్టం చేశారు.

"గిలీడ్ సైన్సెస్ సంస్థ 4 లక్షల 50 వేల రెమ్​డెసివిర్ డోసులు అందించేందుకు సుముఖత చూపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఎంతో అవసరం. రష్యా, యూఏఈలకు చెందిన సంస్థలు 3 లక్షల ఫావిపిరవిర్ డోసులు అందించనున్నాయి. టోసిలీజుమాబ్ ఔషధం జర్మనీ, స్విట్జర్లాండ్​​ నుంచి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 40 దేశాలు భారత్​కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాయి.''

-- హర్షవర్ధన్​ శ్రింగ్లా, విదేశాంగ కార్యదర్శి

రానున్న రోజుల్లో 4వేలకు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు భారత్​ రానున్నాయన్నారు. ఈజిప్టు నుంచి 4 లక్షల రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లు సమకూర్చుకునేందుకు భారత్ యత్నిస్తోందన్నారు. అంతేకాక 10వేలకు పైగా ఆక్సిజన్ సిలిండర్లు, 17 ఆక్సిజన్ క్రయోజెనిక్ ట్యాంకర్లు కూడా దేశంలోకి రానున్నట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే కొన్ని చేరుకున్నాయన్నారు.

ఇదీ చదవండి : హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.