ETV Bharat / bharat

'లవ్​ జిహాద్' ఆర్డినెన్సుపై మాయ అనుమానాలు

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 'లవ్​ జిహాద్'​ ఆర్డినెన్సుపై మరోసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఈ ఆర్డినెన్స్​ సందేహాలు, భయాలతో కూడుకుందని ఆమె వ్యాఖ్యానించారు.

Mayawati asks UP govt to reconsider its new anti-conversion law
'యోగీ జీ.. లవ్​ జిహాద్​ను పునః పరిశీలించండి'
author img

By

Published : Nov 30, 2020, 1:38 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో 'లవ్​ జిహాద్' ఆర్డినెన్సుపై పునరాలోచించాలని బహుజన్​ సమాజ్​ పార్టీ(బీఎస్పీ) మాయావతి ఆ రాష్ట్ర సర్కారును కోరారు. ఈ ఆర్డినెన్స్​లో పలు సందేహాలు, భయాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ చట్టం అమలైన మరుసటి రోజే బరేలీ జిల్లాలో ఓ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా ఆమె స్పందించారు.

Mayavati tweet
బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్​

"యోగి సర్కార్​ తొందరపాటు చర్యలతో తీసుకొచ్చిన లవ్​ జిహాద్​ ఆర్డినెన్స్​.. సందేహాలు, భయాలతో కూడుకుని ఉంది. దేశంలో బలవంతపు మతమార్పిడి చేసేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. ఈ విషయంలో ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపై మరోసారి ఆలోచించాల్సిన అవసరముంది."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

సమాజ్​వాద్​ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ ఇప్పటికే ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించారు.

ఏమిటీ ఆర్డినెన్స్?

బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఈ ఆర్డినెన్సును ఆమోదించింది. దీని ప్రకారం బలవంతంగా మత మార్పిడికి పాల్పడినవారికి పదేళ్ల వరకు జైలుశిక్ష, గరిష్ఠంగా రూ. 50వేల వరకు జరిమానా విధించే అవకాశముంది.

ఇదీ చదవండి: మైనర్​ను రేప్​ చేసి.. గొంతుకోసి.. ఆపై బావిలో పడేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.