దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ వేడుకల కోసం సిద్ధమవుతున్నారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర.. ఈ వేడుకలకు కాస్త ముందుగానే ప్రారంభించింది.
![Mathura: Laddumar Holi celebration in Barsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11106723_7.jpg)
![Mathura: Laddumar Holi celebration in Barsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11106723_1.jpg)
మథురలోని బర్సానాలో హోలీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రంగు నీళ్లతో పాటు.. పూలు, లడ్డూలతో పండగ చేసుకుంటారు. దీన్నే లడ్డూమార్ హోలీగా పిలుస్తారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి ఔత్సాహికులు వస్తుంటారు.
![Mathura: Laddumar Holi celebration in Barsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11106723_8.jpg)
![Mathura: Laddumar Holi celebration in Barsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11106723_2.jpg)
![Mathura: Laddumar Holi celebration in Barsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11106723_6.jpg)
హోలీ పండగను బ్రజ్(కృష్ణుడు ఆడుకునే స్థలం, బృందావనం)లో 40 రోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజు లడ్డూమార్ హోలీ వేడుకలు జరుగుతాయి. వీటిని చూసి తరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
ఇదీ చూడండి: అసలు హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ?