ETV Bharat / bharat

ప్లాట్​ఫామ్​పై డ్రమ్ములో మహిళ మృతదేహం.. ఐదు రోజుల క్రితమే చంపి..! - son killed father

రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్​ ప్లాట్​ఫామ్​ వద్ద డ్రమ్ములో మహిళ మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. కర్ణాటకలోని యశ్వంత్​పుర్​ రైల్వేస్టేషన్‌ను శుభ్రం చేసే సిబ్బంది దీనిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు తండ్రిని గడ్డపారతో కొట్టి చంపాడు ఓ కొడుకు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

married-woman-dead-body-found-in-drum-at-railway-station-at-karnataka
కర్ణాటక రైల్వేస్టేషన్‌లోని డ్రమ్ములో మహిళ మృతదేహం
author img

By

Published : Jan 5, 2023, 9:09 AM IST

Updated : Jan 5, 2023, 9:35 AM IST

కర్ణాటకలో అత్యంత భయానకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని యశ్వంత్‌పుర్‌ రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం వద్ద ఓ డ్రమ్ములో కుళ్లిపోయిన దశలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేసే సిబ్బంది డ్రమ్మును గుర్తించి.. అందులోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా.. కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించారని అధికారులు తెలిపారు.

డ్రమ్ములో మృతదేహంపై బట్టలు కప్పి ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే, పాలిథీన్‌ కవర్‌లో ఆమె శవాన్ని చుట్టి ఆ తర్వాత డ్రమ్ములో కుక్కినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళను వివాహితగా గుర్తించిన పోలీసులు.. ఆమె వయస్సు 25 నుంచి 30 ఏళ్లకు మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు. ఐదు రోజుల క్రితమే మహిళను చంపి డ్రమ్ములో కుక్కి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Married woman dead body found in Drum at Railway station at karnataka
డ్రమ్ములో మహిళ మృతదేహం

"రైల్వే స్టేషన్‌లో ఓ డ్రమ్‌ కనిపించింది. అందులోంచి దుర్వాసన వస్తుంది. దీంతో రైల్వే సిబ్బంది వెళ్లి చూడగా.. అందులోనే మృతదేహం లభ్యమైంది. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నాం. ఘటనపై విచారణ చేపడుతున్నాం" అని రైల్వే ఎస్పీ డా.సౌమ్యలత ఎస్‌కే తెలిపారు.

తండ్రిని దారుణంగా చంపిన కొడుకు..
తండ్రిని గడ్డపారతో కొట్టి చంపాడు ఓ కొడుకు. ఒడిశాలో ఈ దారుణం వెలుగుచూసింది. సోమవారం ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడిని ఎలోహిమ్ గుయాగా పోలీసులు గుర్తించారు. తండ్రీకొడుకుల మధ్య ఓ విషయంపై గొడవ జరిగింది. ఈ వాగ్వాదం మరింత ముదిరింది. దీంతో విచక్షణ కోల్పోయిన ఎలోహిమ్.. తండ్రి నందకిశోర్​పై పారతో దాడి చేయగా​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై నందకిశోర్ చిన్న కుమారుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలోహిమ్ గుయాపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

రెండు నెలల చిన్నారి ప్రాణాలు తీసిన కోతులు..
రెండు నెలల చిన్నారి ప్రాణం తీశాయి కోతులు. నిద్రిస్తున్న బాబును ఎత్తుకెళ్లిన కోతులు.. అనంతరం మేడపై నుంచి కిందకు విసిరేశాయి. దీంతో ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. బందా జిల్లా తింద్వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న విశ్వేశ్వర్ వర్మ బిడ్డను నాలుగు కోతులు ఎత్తుకెళ్లాయి. దీంతో ఆ చిన్నారి ఏడవడం ప్రారంభించాడు. అనంతరం చిన్నారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు.. వెళ్లి చూడగా కోతుల చేతిలో బాబు ఉన్నాడు. దీంతో వారంతా బిగ్గరగా అరిచారు. కోతులు ఒక్కసారిగా చిన్నారిని మేడపై నుంచి కిందకు విసిరేశాయి. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.

Last Updated : Jan 5, 2023, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.