ఏళ్లుగా వరకట్న భూతంపై పోరాటాలు సాగుతున్నా, కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. కొందరి ధన దాహానికి మహిళలు బలైపోతున్నారు(dowry death). అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లాలో జరిగింది. వరకట్నం (dowry news latest) తీసుకురావాలని అత్తింటివారి వేధింపులకు.. వివాహమై ఏడాది గడవక ముందే బలవన్మరణానికి(Married woman commits suicide) పాల్పడింది ఓ నవవధువు.
ఇదీ జరిగింది!
జిల్లాలోని ఇమలియాకు చెందిన రామస్వరూప్ అవస్థీ.. తన కూతురు అంకితను గంఢీమలహరాకు చెందిన విష్ణు అరజారియాకు ఇచ్చి గతేడాది డిసెంబర్ 6న వివాహం చేశారు. అంకితను డిగ్రీ వరకు చదివించారు. తమ తాహతుకు తగ్గట్లు కట్నకానుకలు ఇచ్చారు.
పెళ్లి జరిగిన కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉన్నారని, ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించారని వాపోయారు రామస్వరూప్. రూ.లక్ష అదనంగా ఇవ్వాలని తన అల్లుడు అడిగాడని, తన వద్ద అంత సొమ్ము లేకపోవటం వల్ల రెండు వాయిదాల్లో ఇస్తానని చెప్పినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.50 వేలు ఇచ్చానని, మిగిలిన రూ.50 వేల కోసం తన కూతురిని నిత్యం వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. కట్నం కోసం తన కూతురిని పలుమార్లు కొట్టారని.. నిత్యం వేధించటం కారణంగానే తన కూతురు విషగుళికలు తిని ప్రాణాల తీసుకుందని(latest dowry death news) ఆరోపించారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇదీ చూడండి: పెళ్లైన మూడో రోజుకే యువతి ఆత్మహత్య- అమ్మానాన్న అలా చేశారని...