Margadarsi 110th Branch Opening in Karnataka : మార్గదర్శి చిట్ ఫండ్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటకలోని హవేరీలో తన 110వ బ్రాంచ్‌ను ప్రారంభించింది. కొత్త బ్రాంచ్‌ను కర్ణాటక మార్గదర్శి డైరెక్టర్ పీ లక్ష్మణ రావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సమష్టి కృషితోనే కర్ణాటకలో 23వ బ్రాంచ్‌ను పెట్టగలిగామని డైరెక్టర్ తెలిపారు. సంస్థ ద్వారా ప్రజలకు విశ్వాసమైన సేవలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
''మార్గదర్శి సంస్థ కర్ణాటకలోని హవేరీలో నేడు తన కొత్త శాఖను ప్రారంభించినట్లు ప్రకటించడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. సంస్థలో హవేరీ బ్రాంచ్ 110వది. కర్ణాటక రాష్ట్రంలో ఇది 23వ శాఖ. క్రమశిక్షణ, విశ్వసనీయత కలిగిన మా సంస్థ నుంచి చిట్ సౌకర్యాలను పొందేందుకు హవేరీ జిల్లా ప్రజలను మేము సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హవేరీ బ్రాంచ్‌లో చిట్ గ్రూప్ విలువలను రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షల చందాతో నెలకు రూ.2,000 నుంచి రూ.1 లక్ష వరకు 25, 30, 40, 50 నెలల చిట్ వ్యవధితో ఖాతాదారులకు అందుబాటులో ఉంచాం. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త చిట్ గ్రూపులను ప్రారంభిస్తాం. ఇది హవేరీలోని అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలియజేయడానికి మేం సంతోషిస్తున్నాం. జిల్లా ప్రజల సహకారం, ఆశీర్వాదాలు మాకు అత్యంత విలువైనవి. - పీ లక్ష్మణ రావు, కర్ణాటక మార్గదర్శి డైరెక్టర్
"కర్ణాటకలో మరో 25 బ్రాంచ్‌లను తెరవడానికి మా వద్ద పుష్కలమైన వనరులు ఉన్నాయి. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కర్ణాటకలో మరో రెండు చోట్ల బ్రాంచ్‌ల విస్తరణ కోసం మేము ముందుకు వెళ్తున్నాం. కర్ణాటక ప్రజలకు అత్యుత్తమ చిట్ సేవలను అందించడానికి మార్గదర్శి ఎల్లప్పుడూ వారి విశ్వసనీయ సంస్థగా, వారి ఆర్థిక అవసరాలకు మంచి ఆర్థిక భాగస్వామిగా నిలుస్తుంది'' అని కర్ణాటక మార్గదర్శి డైరెక్టర్ పీ లక్ష్మణ రావు స్పష్టం చేశారు.
ఖాతాదారుల హర్షం..: హవేరీలో నూతన బ్రాంచ్‌ను ఓపెన్ చేయడం పట్ల ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు. మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని అన్నారు. బ్యాంకులతో పోల్చితే సులభంగా తాము తమ డబ్బును పొందగలుగుతున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. మార్గదర్శిని నమ్మి వేల కుటుంబాలు చిట్స్ కడుతున్నాయన్న ఖాతాదారులు.. డబ్బు తీసుకునేటప్పుడు తమకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు కలగలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మార్గదర్శి సంస్థకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
1962 అక్టోబర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలైన మార్గదర్శి సంస్థ.. ప్రస్తుతం 110 బ్రాంచ్‌లు, 5 వేల మంది సిబ్బందితో అగ్రగామి సంస్థగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. 6 దశాబ్దాలుగా దాదాపు 60 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది.