ఒడిశా, కందమాల్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్ క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. కాలంపాడ అటవీ ప్రాంతంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా సూపరింటెండెండ్ వినీత్ అగర్వాల్ పేర్కొన్నారు.
కాలంపాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంపులు ఉన్నాయని సమాచారం అందగా.. పోలీసు ప్రత్యేక దళాలు, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. నక్సల్స్‌కు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు. కనీసం 12 మంది మావోయిస్టులు క్యాంపులను వదిలి పారిపోయారని తెలిపారు.
ఇదీ చదవండి: బంగాల్ భాజపా అధ్యక్షుడి వాహనంపై దాడి