Boat Accident: ఝార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది.. పంచఖేరో డ్యామ్‌లో బోటు షికారు చేద్దామని వెళ్లారు. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికే వారి పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో పడవ నడిపే వ్యక్తితో పాటు అందులోని పర్యటకులంతా నీటిలో పడిపోయారు. అయితే వారిలో బోట్మన్తో పాటు మరో వ్యక్తి.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. గల్లంతైనవారిలో ఏడుగురు పిల్లలే కావడం గమనార్హం.
విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు.. డ్యామ్ వద్దకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కోడెర్మా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు.. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. "పంచఖేరో డ్యామ్‌లో బోటు షికారు చేసేందుకు పిల్లలతో కలిసి వచ్చాం. జలాశయం మధ్యకు చేరుకునేసరికి పడవలోకి నీళ్లు వచ్చాయి. వెంటనే పడవ బోల్తా పడింది. నేను, పడవ నడిపే వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాం. మిగిలిన పిల్లలతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యారు" అని ప్రాణాలతో బయటపడిన ప్రదీప్ సింగ్ చెప్పారు.
ఇవీ చదవండి: వర్షంలో పురిటినొప్పులు.. ఆస్పత్రికి వెళ్లేందుకు తిప్పలు.. నదీతీరంలోనే ప్రసవం
లిక్కర్ స్మగ్లింగ్‌లో శునకం అరెస్ట్.. 11 రోజులుగా జైలులో.. పోలీసులకు ముప్పతిప్పలు!