ETV Bharat / bharat

'రజనీ భాజపాతో కలుస్తారో.. ఇంకేం చేస్తారో'

రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జి దినేష్ గుండూరావు పేర్కొన్నారు. రజనీకాంత్‌తో అనేకమంది భాజపా వాళ్లకు సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భాజపాతో ఆయన కలుస్తారో లేదో వేచి చూడాలని అన్నారు.

rajini bjp links
'రజనీతో భాజపా వాళ్లకు సంబంధాలున్నాయి'
author img

By

Published : Dec 5, 2020, 10:01 PM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఏర్పాటు చేయబోయే పార్టీపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. పార్టీ సిద్ధాంతం, కార్యక్రమం, ఎన్నికల రోడ్‌మ్యాప్‌.. ఇలా వేటిపైనా ఒక స్పష్టత రాకుండా వచ్చే ఏడాదిలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటే అవుతుందని తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి, కర్ణాటక పీసీసీ చీఫ్‌ దినేశ్‌ గుండూరావు అన్నారు. ఇప్పటికైతే రజనీకాంత్‌తో అనేకమంది భాజపా వాళ్లకు సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

"రజనీ ఏర్పాటు చేయబోయే పార్టీ ఇంకా రిజిస్టర్‌ కాలేదు. ఆయన ప్రతిపాదించిన సంస్థ సిద్ధాంతం, కార్యక్రమం ఏంటో కూడా తెలియదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తుందో, ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందో, లేదో.. దేనిపైనా స్పష్టత రాలేదు. భాజపాతో కలుస్తారో, ఇంకేం చేస్తారో వేచి చూడాల్సి ఉంది."

-దినేశ్ గుండూరావు, కర్ణాటక పీసీసీ చీఫ్

డిసెంబర్‌ 31న కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురువారం వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా స్పష్టంచేశారు. తమిళనాడు తలరాతను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, రాజకీయాలను, ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. "ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ మార్చలేం.. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం" అంటూ రజనీ రాజకీయ అరంగేట్రం చేస్తూ సంచలన ప్రకటన చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.