ETV Bharat / bharat

ఘోర ప్రమాదం.. లారీ, వ్యాన్​ ఢీకొని ఒకే కుటుంబంలో 9 మంది మృతి - మహారాష్ట్ర యాక్సిడెంట్

లారీ, వ్యాన్​ ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించారు. మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలో ముంబయి-గోవా రహదారిపై గురువారం ఉదయం జరిగిందీ ప్రమాదం.

Maharashtra accident today
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 19, 2023, 8:27 AM IST

Updated : Jan 19, 2023, 8:52 AM IST

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. రాయగడ జిల్లా రెపోలీ ప్రాంతంలో ముంబయి-గోవా రహదారిపై గురువారం ఉదయం 4.45కు జరిగిందీ ప్రమాదం.
పోలీసుల సమాచారం ప్రకారం.. వ్యాన్​లో ఉన్నవారంతా బంధువులు. అందరూ కలిసి రత్నగిరి జిల్లాలోని గుహాగర్​కు వెళ్తున్నారు. ముంబయి వెళ్తున్న లారీ.. వేగంగా వచ్చి వ్యాన్​ను ఢీకొట్టింది. వ్యాన్​లోని ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు మరణించారు. మరో నాలుగేళ్ల బాలికకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారిని మన్​గావ్​లోని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణమేంటో తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Maharashtra accident today
ప్రమాదానికి గురైన వ్యాన్
Maharashtra accident today
వ్యాన్​ను ఢీకొట్టిన లారీ
Maharashtra accident today
తీవ్రంగా దెబ్బతిన్న వ్యాన్ ముందు భాగం

Last Updated : Jan 19, 2023, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.