ETV Bharat / bharat

Manish Sisodia Supreme Court : 'రూ.338 కోట్ల బదిలీ నిజమే!'.. సిసోదియాకు సుప్రీం నో బెయిల్​ - మనీశ్​ సిసోదియా తాజా వార్తలు

Manish Sisodia Supreme Court Today : దిల్లీ మద్యం కుంభకోణం కేసుల్లో అరెస్టయిన ఆప్‌ నేత మనీశ్ సిసోదియాకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించిందని న్యాయస్థానం వెల్లడించింది.

Manish Sisodia Latest News
Manish Sisodia Latest News
author img

By PTI

Published : Oct 30, 2023, 12:17 PM IST

Updated : Oct 30, 2023, 12:41 PM IST

Manish Sisodia Supreme Court Today : దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టయిన ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

'రూ.338 కోట్ల నగదు బదిలీకి..'
అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించిందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే.. సిసోదియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్​కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

'కేజ్రీవాల్ అరెస్ట్​ అవ్వడం పక్కా!'
Manish Sisodia Latest News : సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్​ తిరస్కరణపై బీజేపీ ఎంపీ మనోజ్​ తివారీ స్పందించారు. "దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తర్వాత.. ఆమ్​ ఆద్మీ పార్టీ అవినీతితో నిండి ఉందని రుజువైంది. ఇక ఆప్​ అగ్రనేతల అరెస్ట్​కు సమయం దగ్గర పడింది. అరవింద్​ కేజ్రీవాల్​ త్వరలోనే అరెస్ట్​ అవుతారు" అని వ్యాఖ్యానించారు.

  • #WATCH | On the Supreme Court rejecting the bail plea of former Delhi Dy CM Manish Sisodia in the Delhi Excise Policy case, BJP MP Manoj Tiwari says, "...After this decision, it has been proved that Manish Sisodia and AAP are full of corruption... Now the arrest of top leaders… pic.twitter.com/G6aYnm54Er

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'కేజ్రీవాల్​ ఇంకెంతకాలం కాపాడుతారు?'
బీజేపీ నేత షెహజాద్​ పూనావాలా కూడా స్పందించారు. "ట్రయల్ కోర్టు, హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా బెయిల్​ ఇచ్చేందుకు నిరాకరించింది. రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించిందని సుప్రీంకోర్టు తెలిపింది. అరవింద్​ కేజ్రీవాల్​ ఇంకెంత కాలం అలాంటి వ్యక్తులను కాపాడుతారు?" అని ప్రశ్నించారు.

  • #WATCH | Delhi: On the Supreme Court rejecting the bail plea of former Delhi Dy CM Manish Sisodia in the Delhi Excise Policy case, BJP leader Shehzad Poonawalla says, "After trial court and high court, now the Supreme Court has also denied bail to Manish Sisodia... All the… pic.twitter.com/Z29QGZ5JzD

కింది కోర్టుల్లో ఊరట లభించకపోవడం వల్ల..
Manish Sisodia Delhi Excise Policy : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో 2023 ఫిబ్రవరి 26న మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత మార్చి 9న ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్‌ కోసం కింది కోర్టుల్లో ఊరట లభించకపోవడం వల్ల సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా.. తాజాగా సుప్రీం అందుకు నిరాకరించింది.

'మోదీకి చదువు విలువ తెలియదు'.. ప్రధాని విద్యార్హతపై సిసోదియా విమర్శలు

Delhi Excise Case :​ సిసోదియాకు ఈడీ షాక్​.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్​!

Last Updated : Oct 30, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.