ETV Bharat / bharat

మణిపుర్​లో మళ్లీ హింస- పోలీసు వాహనంపై దుండగుల కాల్పులు- ఓ వ్యక్తి హత్య - మణిపుర్ పోలీసులు ఫైరింగ్

Manipur Violence Militants Attack : మణిపుర్​లో పొలీసుల కమాండో వాహనంపై సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరువైపుల నుంచి భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అసోం రైఫిల్​ బెటాలియన్​కు చెందిన ఓ జవాన్ గాయపడ్డాడు.

Manipur violence militants attack
Manipur violence militants attack
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 8:25 PM IST

Updated : Dec 30, 2023, 9:29 PM IST

Manipur Violence Militants Attack : మణిపుర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పోలీస్‌ కమాండోలపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తెంగ్‌నౌపాల్ జిల్లాలోని మోరేలో శనివారం 3:50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భారత్‌ - మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన మోరే నుంచి కీలక ప్రాంతాలకు వెళుతున్న పోలీసు కమాండో వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని సాయుధులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మొదట రెండు బాంబులు పేలాయని, ఆ తర్వాత 350 నుంచి 400 రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇరు వైపుల కాల్పులు జరిగాయని చెప్పారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడగా అసోం రైఫిల్స్‌ క్యాంపులో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్- ఐఆర్​బీకి చెందిన పొన్‌ఖలుంగ్‌గా గుర్తించారు. మరోవైపు, మోరేలో రెండు ఇళ్లను తగులబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. న్యూ మోరే గేట్ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

మరోవైపు, శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ రక్షకుడిని కాల్చి చంపారు. మృతుడిని జమేశ్ నింగోంబమ్​గా గుర్తించారు. పశ్చిమ ఇంఫాల్​ జిల్లాలోని కదంగ్​బాండ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టు మార్టం పరీక్షల కోసం సమీపంలోని మెడికల్ కాలేజీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సమీపంలోని పర్వత ప్రాంతానికి చెందిన వ్యక్తులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతం కంగ్​పోక్పి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ కంగ్​పోక్పి జిల్లాలోనే మే 3న అల్లర్లు చెలరేగడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఈ ఘటనలపై మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ స్పందించారు. గ్రామ రక్షకుడి హత్యను ఖండించారు. హింసను పక్కకు పెట్టి చర్చలతో రాష్ట్రంలో శాంతి స్థాపించాలని కోరారు. అల్లర్ల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, గ్రామ రక్షకుడి హంతకులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. కొండలు, లోయ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రజా సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నాయని సీఎం హామీ తెలిపారు.

మణిపుర్​లో రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు- 13మంది మృతి

Manipur Firing Today : మణిపుర్​లో ఆగని హింస.. దుండగుల కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు మృతి

Last Updated : Dec 30, 2023, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.