దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలో ఘోరం జరిగింది. ఓ మహిళ, ఓ వ్యక్తి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సుప్రీంకోర్టు గేట్ డీ వద్ద జరిగింది.
అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పి, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. బాధితుల ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. వారు ఎవరో గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు.
ఇదీ చదవండి:ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ప్రియుడి గొంతు కోసిన ప్రేయసి