ETV Bharat / bharat

'నువ్వేడికెల్తే ఆడికొస్తా'అంటూ.. యువనటిని వెంబడించిన ఆగంతకుడు - కేబీఆర్‌ పార్కులో యువనటిని వెంబడించిన ఆగంతకుడు

Man stalked an actress at KBR park in Hyderabad : హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ఓ ఆగంతకుడు యువనటిని వెంబడించాడు. గమనించిన నటి వెంటనే అప్రమత్తమై తోటి వాకర్స్‌ను అలర్ట్ చేయగా వారు పార్కు సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఈ యువనటి ఇదే పార్కుకు వచ్చినప్పుడు ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Man stalked an actress at KBR park in Hyderabad

author img

By

Published : Mar 2, 2023, 11:16 AM IST

Man stalked an actress at Hyderabad KBR park : సాధారణంగా సెలబ్రిటీల లైఫ్‌ స్టైల్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు వారి సోషల్ మీడియా ఖాతాలను స్టాక్ చేస్తూ వారి డైలీ రొటీన్ గురించి తెలుసుకుంటారు. మరికొందరు మాత్రం కాస్త ముందడుగేసి వారిని నిజ జీవితంలోను ఫాలో అవుతుంటారు. అలా ఫాలో అయి స్టాక్ చేయడం వల్ల చాలా సార్లు చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఈ వీరాభిమానుల వీరాభిమానం సెలబ్రిటీలకు ముప్పు తెచ్చిపెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Man followed an actress at KBR park : ఓ వ్యక్తి యువ నటిని ఫాలో అయ్యాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లడం షురూ చేశాడు. ఇలా ఫాలో అయ్యే క్రమంలో ఆమె ప్రతిరోజు హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వస్తుందని గ్రహించాడు. ఇక అక్కడ ఇక్కడ తిరగడం మానేసి ఆమెను పార్క్‌లోనే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ప్రతి రోజూ ఆమె పార్కుకు వచ్చే సమయంలోపే అక్కడ ఉండేవాడు. రోజూ ఆమె గమనించకుండా ఆమె వెనకే ఫాలో అయ్యేవాడు.

Man followed an actress at KBR park in Hyderabad : అలాగే బుధవారం రాత్రి కూడా కేబీఆర్ పార్కుకు వెళ్లాడు ఆ ఆగంతకుడు. రాత్రి 7 గంటల సమయంలో అక్కడికి వచ్చిన ఆ యువ నటిని వెంబడించాడు. అయితే ఇవాళ ఆ నటి కంట్లో పట్టాడు. ఆమెను ఎవరో వెంబడిస్తున్నారనే విషయం అర్థమై ఆ నటి నెమ్మదిగా నడవం ప్రారంభించింది. ఆమె నెమ్మదిగా నడిస్తే నెమ్మదిగా నడవడం.. నడక ఆపేసి నిలిచిపోతే అతడు కూడా నిలిచిపోవడంతో ఆమె తననే ఫాలో అవుతున్నాడని నిర్ధారించుకుంది. వెంటనే అప్రమత్తమైన ఆ నటి తోటి నడకదారులను అప్రమత్తం చేసింది.

వారి సాయంతో ఆ ఆగంతకుడి గురించి పార్కు సిబ్బందికి సమాచారం అందించారు. ఎట్టకేలకు అక్కడి సిబ్బంది అతణ్ని పట్టుకున్నారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఆ నటి వెంట పడిన వ్యక్తి శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఈ యువనటి ఇదే ఉద్యానానికి నడకకు రాగా ఓ అగంతకుడు బెదిరించి లైంగిక దాడికి యత్నించాడని పోలీసులు తెలిపారు.

నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పార్కులో ఉన్న సీసీ కెమెరాలను, ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి పార్కు పరిసరాల్లో సంచరించినట్లు తెలుస్తోందని.. కానీ ఆమెతో మాట్లాడినట్లు గానీ.. వేధించినట్టు గానీ.. అసభ్యంగా ప్రవర్తించినట్టు గానీ ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం శేఖర్‌కు, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ నటి పబ్లిసిటీ కోసమే ఇదంతా క్రియేట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.