ETV Bharat / bharat

బిర్యానీ బిల్లు విషయంలో గొడవ, కత్తితో దారుణంగా పొడిచి - dispute over biryani bill

బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. రూ.50 చెల్లించలేదని బిర్యానీ తిన్న వ్యక్తిని ఓ హోటల్​ యజమాని కత్తితో దారుణంగా పొడిచాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని జలాన్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

biryani dispute in UP
Man stabbed after dispute over biryani bill
author img

By

Published : Aug 19, 2022, 10:58 AM IST

Updated : Aug 19, 2022, 11:04 AM IST

Man Stabbed Over Bill: ఉత్తర్​ప్రదేశ్​లోని జలాన్​ జిల్లాలో దారుణం జరిగింది. బిర్యానీ కోసం ఓ వ్యక్తిని కత్తితో పొడిచాడో దుండగుడు. తీవ్ర గాయాలతో చికిత్స బాధితుడి చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఒరాయ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని రాంజీ అనే వ్యక్తి బిర్యానీ తినడానికి ఓ హోటల్​కు వెళ్లాడు. తినడం అయిపోయాక దుకాణాదారుడు రామ్​సింగ్​కు రూ.50 బిల్లు చెల్లించాడు. అయితే, డబ్బులు చెల్లించలేదని, మళ్లీ ఇవ్వమని రామ్​సింగ్.. రాంజీని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి రామ్​సింగ్.. రాంజీని కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాల పాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించామని ఒరాయ్​ ఇన్​స్పెక్టర్​​ తెలిపారు. ఘటనా సమయంలో నిందితుడు, బాధితుడు ఇద్దరూ మత్తులో ఉన్నారని చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

ఇవీ చూడండి: మమతతో సుబ్రహ్మణ్య స్వామి భేటీ, ధైర్యవంతురాలంటూ ప్రశంసలు, మోదీపై ఫైర్

బీచ్​లో అనుమానిత బోటు, లోపల ఏకే47 గన్స్, అసలేమైంది

Last Updated : Aug 19, 2022, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.