హరియాణాలోని సోనీపత్లో(sonipat crime news) దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన భాగస్వామిపై పెట్రోల్ పోసి(man sets woman on fire) నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఏం జరిగిందంటే?
ప్రగతి, రాహుల్ అనే ఇద్దరు కుండ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. చాలా రోజుల నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగతి ఎనిమిది నెలల గర్భంతో ఉందని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగిందని.. ఈ కోపంలో ప్రగతిపై రాహుల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పారు. ప్రస్తుతం యువతి దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని వివరించారు.
యువతి పరిస్థితిని చూసి ఆస్పత్రి యాజమాన్యం తమకు సమాచారం అందించిందని పోలీసులు వివరించారు. వెంటనే దిల్లీకి వెళ్లి యువతి వాంగ్మూలం తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం, యువకుడితో పాటు అతడి తల్లిపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: 200 మంది చిన్నారుల మధుర 'వేణుగానం'