ETV Bharat / bharat

హార్లీ డేవిడ్​సన్ బైక్​పై ఇంటింటికీ తిరుగుతూ పాల వ్యాపారం - హార్లీ డేవిడ్‌సన్ బైక్​పై పాలు అమ్ముతున్న యువకుడు

రోజూ ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవాళ్లు ఏం వాహనం వాడతారు? సైకిల్, బైక్, మహా అయితే ఆటో. కానీ.. ఓ వ్యక్తి మాత్రం లక్షల రూపాయలు విలువ చేసే హార్లీ డేవిడ్​సన్​ బైక్​పై తిరుగుతూ పాల వ్యాపారం చేస్తున్నాడు. అతడి కథేంటో మీరే చూడండి.

man selling milk on harley davidson bike
హార్లీ డేవిడ్​సన్ బైక్​పై పాలు అమ్ముతున్న బ్యాంక్ ఉద్యోగి
author img

By

Published : Jan 19, 2023, 10:10 AM IST

Updated : Jan 19, 2023, 1:03 PM IST

హార్లీ డేవిడ్​సన్ బైక్​పై ఇంటింటికీ తిరుగుతూ పాల వ్యాపారం

ఖరీదైన హార్లీ డేవిడ్​సన్​ బైక్​కు క్యాన్లు కట్టుకుని, ఇంటింటికీ తిరిగి పాలు పోస్తున్న ఓ వ్యక్తి.. రాత్రికి రాత్రే నెట్టింట ఫేమస్ అయ్యాడు. హరియాణా ఫరీదాబాద్​ జిల్లా మొహబ్బతాబాద్ గ్రామానికి చెందిన అమిత్ భదానా అనే వ్యక్తి ఒకప్పుడు బ్యాంక్ ఉద్యోగి. కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి కుటుంబ వ్యాపారంలోకి దిగాడు. లక్షల రూపాయలు విలువైన బైక్​ కొన్నాడు. ఆ బైక్​ మీదే ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్నాడు. ఇలా పాలు అమ్ముతున్న వీడియో సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది.

అమిత్ భదానా గ్రాడ్యుయేషన్ వరకు చదివాడు. ఆ తర్వాత బ్యాంక్‌లో పని చేయడం ప్రారంభించాడు. ఒకే చోట కూర్చొని పనిచేయడం ఇష్టం లేక బ్యాంక్ ఉద్యోగం మానేశాడు. అమిత్ భదానాకు చిన్నప్పటి నుంచి బైక్‌లంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే హార్లీ డేవిడ్‌సన్ బైక్​ను కొన్నాడు. అప్పటి నుంచి ఆ బైక్​పై పాలు అమ్మడం ప్రారంభించాడు. అలా తనకిష్టమైన బైక్​పై.. తనకు నచ్చిన పాల వ్యాపారం చేస్తున్నాడు. హార్లీ డేవిడ్‌సన్ బైక్​ ధర 5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంత ఖరీదైన బైక్​పై పాలు అమ్మడం ఏంటని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు.

man selling milk on harley davidson bike
హార్లీ డేవిడ్​సన్ బైక్​పై అమిత్ భదానా

బైక్​పై పాలు అమ్ముతున్న వీడియో వైరలై, అమిత్​ ఫేమస్ అవ్వడం వల్ల అతడిని కలిసేందుకు చాలా మంది మొహబ్బతాబాద్ వస్తున్నారు. దీంతో అమిత్​, అతని కుటుంబ సభ్యులు అమితానందంలో ఉన్నారు.

"హార్లీ డేవిడ్​సన్​ బైక్​ను నా ఇష్టం కొద్దీ తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ బైక్‌పై ఇంటింటికీ పాలు పంపిణీ చేస్తున్నాను. సరదాగా పెట్టిన వీడియోతో ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. మోడలింగ్ ఇష్టం లేకపోయినా ఆఫర్లు రావడం వల్ల ఆల్బమ్స్‌లో పని చేస్తాను."
--అమిత్ భదానా

పాలు అమ్ముతున్నఅమిత్ భదానా

ఇవీ చదవండి:

Last Updated : Jan 19, 2023, 1:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.