Shooting In Court Complex: రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ సెషన్స్ కోర్టు ఆవరణలో హత్య కేసు నిందితుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. నాటు తుపాకీ కావడం వల్ల తూటా బయటకి రాకపోవటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇదీ జరిగింది..
నిహాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలారీలో నివసించే దివాన్ సింగ్ అనే వ్యక్తి 5 సంవత్సరాల క్రితం ధోల్‌పుర్‌కు చెందిన సంజు బాల్మీకిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే బెయిల్‌పై విడుదలై విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యాడు. కొన్ని రోజులుగా అతనికి చంపుతామని బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే చనిపోయిన వ్యక్తి సోదరుడు అశోక్‌తో పాటు మరో ఆరుగురు గురువారం కోర్టుకు వచ్చారు. దివాన్సింగ్పై అశోక్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఇరుక్కుపోయి తుపాకీ పేలకపోవడం వల్ల దివాన్ సింగ్ వారి నుంచి తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు.
అక్కడే ఉన్న ధోల్‌పుర్ జడ్జి రీటా తేజ్‌పాల్ దివాన్ సింగ్‌పై జరిగిన దాడి గురించి తెలుసుకున్నారు. పరారైన నిందితులను పట్టుకోవాలని ఎస్పీని ఆదేశించారు. నిహల్‌గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి.. నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
దివాన్ సింగ్ పేరు మోసిన రౌడీ షీటర్ అని పోలీసులు పేర్కొన్నారు. అతని పై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్లు గుర్తు చేశారు.
ఇదీ చూడండి: Medical Student killed: కారు ఢీకొని వైద్య విద్యార్థిని మృతి