ETV Bharat / bharat

'నా స్నేహితుడిని చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు'.. మృతదేహం కోసం ఏడాదిగా.. - వ్యక్తి కలలోకి మృతుడు

"20 ఏళ్ల క్రితం అతడిని చంపేశాను.. ఇప్పుడు నా కలలోకి వస్తున్నాడు.. చాలా ఇబ్బందిగా ఉంది" అంటూ ఓ వ్యక్తి తన గ్రామస్థులకు చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల.. ఆ మృతదేహం కోసం సంవత్సరం పాటు అధికారులు గాలిస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. అసలేం జరుగుతోంది? ఆ కథేంటి?

man-mardered-and-buried-official-searching-for-died-body-in-chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌లో వ్యక్తి హత్య
author img

By

Published : Apr 20, 2023, 12:00 PM IST

ఓ వ్యక్తి మృతదేహాం కోసం సంవత్సరం నుంచి ఛత్తీసగఢ్​ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం.. తాను ఓ వ్యక్తిని చంపి అడవిలో పాతి పెట్టానని మరో వ్యక్తి చెప్పడం వల్ల ఈ చర్యలు చేపడుతున్నారు. తీరా కొద్దిరోజులకే అతడి మానసిక ఆరోగ్యం చెడిపోయింది. దీంతో అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం కూడా తవ్వకాలు చేపట్టగా.. కొన్ని ఎముకలు మాత్రమే లభించాయి. అసలు ఈ కథేంటంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలోద్ జిల్లాలోని కరక్‌భాట్​కు చెందిన టికం కొలియారా అనే వ్యక్తి.. 2003లో తాను ఛవేశ్వర్ గోయల్​ అనే వ్యక్తిని హత్య చేశానని సంవత్సరం క్రితం గ్రామస్థులతో తెలిపాడు. అనంతరం అడవిలో పాతిపెట్టానని వారికి వెల్లడించాడు. దీంతో గ్రామస్థులు టికం కొలియారాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టికం కొలియారా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడు చెప్పిన వివరాల ఆధారంగా తవ్వకాలు చేపట్టారు. కానీ ఛవేశ్వర్​ మృతదేహం లభించలేదు.

ఈలోపు.. టికం కొలియారా మానసిక ఆరోగ్యం బాగాలేదని అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. కానీ ఈ విషయంలో ఛవేశ్వర్ తండ్రి పట్టువిడవలేదు. మరోసారి తవ్వకాలు జరపాలంటూ అధికారులను ఆశ్రయించాడు. ఎలాగైనా తన కుమారుడు ఆచూకీ కనుక్కొవాలని వారిని వేడుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టారు. అనంతరం డ్యామ్​ పక్కన జరిపిన తవ్వకాల్లో కొన్ని ఎముకలను, వస్త్రాలను గుర్తించారు. అవి ఎవరి ఎముకలు అనే విషయాన్ని గుర్తించేందుకు ల్యాబ్​కు పంపించారు. అవి కచ్చితంగా.. ఛవేశ్వర్ ఎముకలేనని చెప్పలేమని పోలీసులు తెలిపారు. డీఎన్​ఏ పరీక్షల తరువాత పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు.

కలలోకి వస్తున్న ఛవేశ్వర్​..
అయితే ఇక్కడే మరో ట్విస్ట్​. ఛవేశ్వర్​ను 2003లో చంపేశానని చెప్పిన టికం.. మరిన్ని విషయాలు వారికి చెప్పాడు. ఛవేశ్వర్​ తన భార్యకు స్నేహితుడని వెల్లడించాడు. ఛవేశ్వర్​ తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. శారీరక సంబంధం కోసం ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు. అందుకే ఛవేశ్వర్​ను హత్ చేసినట్లు.. గ్రామస్థులతో టికం కొలియారా చెప్పాడు. ఈ మధ్య కాలంలో ఛవేశ్వర్​ పదే పదే తన కలలోకి వస్తున్నాడని చెప్పిన టికం కొలియారా.. తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులకు తెలిపాడు. ప్రస్తుతం టికం కొలియారా.. కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తండ్రి.. కుమారుడు తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.