ETV Bharat / bharat

బస్సులో హస్తప్రయోగం.. మహిళతో యువకుడి అసభ్య ప్రవర్తన.. బీజేపీ కౌన్సిలర్​కు వేధింపులు - మహిళా కౌన్సిలర్‌పై లైంగిక వేధింపులు

మహిళ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. ఆమె పక్కన కూర్చుని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అనంతరం యువకుడిని పట్టుకున్న తోటి ప్రయాణికులు.. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కేరళలో ఈ ఘటన జరిగింది. మరోవైపు మహిళ కౌన్సిలర్​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. దీంతో ఆమె భర్తతో కలిసి ఆత్మహత్యయత్నం చేసింది. ఛత్తీస్​ఘఢ్​లో ఘటన జరిగింది.

man-misbehaving-with-woman-in-kerala-rtc-bus-and-police-arrested-accused
మహిళపై యువకుడి అసభ్య ప్రవర్తన
author img

By

Published : May 19, 2023, 11:35 AM IST

కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె పక్కన కూర్చుని.. వికృత చర్యలకు పాల్పడ్డాడు. దీనిపై సదరు మహిళ యువకుడిని ఎదిరించింది. వెంటనే కండక్టర్​కు ఫిర్యాదు చేసింది. అనంతరం కండక్టర్​, తోటి ప్రయాణికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఏర్నాకులం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

కోజికోడ్​కు ప్రాంతానికి చెందిన నిందితుడు పేరు సవాద్​... బుధవారం ఉదయం అంగమాలి వద్ద త్రిస్సూర్​ నుంచి కొచ్చి వెళ్లే బస్సు ఎక్కాడు. ఓ మహిళ పక్కన కూర్చున్నాడు. హస్తప్రయోగం చేస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై యువకుడిని ప్రశ్నించిన సదరు మహిళ.. ఘటనపై బస్సు కండక్టర్​కు ఫిర్యాదు చేసింది.

man-misbehaving-with-woman-in-kerala-rtc-bus-and-police-arrested-accused
నిందితుడు

నిందితుడిని మందలించిన కండక్టర్​.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయమని బాధితురాలిని సూచించాడు. దాంతో కంగారు పడ్డ సవాద్​.. బస్సు ఆగిన వెంటనే అందరిని తోసేసి.. అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్​, తోటి ప్రయాణికులు.. యువకుడిని వెంబడించి ఎయిర్​పోర్ట్​ సిగ్నల్​ వద్ద పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనకు సంబంధించిన ఓ పుటేజ్​ను బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది. ఈ వీడియోను చూసిన.. చాలా మంది యువతులు తాము సైతం ఆ వ్యక్తి చేతిలో వేధింపులకు గురైనట్లు తెలిపారు. మరికొంత మంది కూడా బస్సుల్లో వివిధ వ్యక్తుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.

మహిళ కౌన్సిలర్​కు లైంగిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నం..
ఛత్తీస్​గఢ్​లోని రాయగఢ్​లో బీజేపీ మహిళా కౌన్సిలర్​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. దీంతో భర్తతో కలిసి ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరూ కలిసి విషం తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు ఎటువంటి చర్యలు తీసుకోనందుకే ఆత్మహత్యయత్నం చేసినట్లు బాధితురాలు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా స్థానికంగా నివాసం ఉండే కొందరు యువకులు.. మహిళ కౌన్సిలర్​ను లైంగికంగా వేధిస్తున్నారు. దీంతో బుధవారం రాత్రి దంపతులిద్దరు విషం తాగి ఆత్మహత్యయత్నం చేశారు. ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. పూర్తి విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకుంటామని వారు వివరించారు.

"స్థానికంగా ఉండే కొందరు యువకులు నన్ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. మే 14న కూడా నాపై వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయిన వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యాను. అందుకే విషం తాగి చనిపోవాలి అనుకున్నా" అని బాధితురాలు పేర్కొన్నారు. తనపై వేధింపులకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్​ చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.