Fake vaccination certificate: కరోనా టీకా తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని 36ఏళ్ల ఫ్రాన్సిస్ నడార్గా గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖంగా లేని వారు ఇతని వద్ద నకిలీ టీకా ధ్రువపత్రం పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. రూ.1000 తీసుకుని అతడు ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. మరికొందరితో కలిసి నడార్ ఈ దందా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ధారావి పోలీసులు వీళ్లని జనవరి 5న అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి డీసీపీ ప్రణయ అశోక్ శుక్రవారం తెలిపారు.

టీకా తీసుకునేందుకు భయపడుతున్న కొందరు డబ్బులు చెల్లించి మరీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీన్ని క్యాష్ చేసుకుని నడార్ దందా నడుపుతున్నాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు.
ఇదీ చదవండి: దేవుడికి కోర్టు సమన్లు!.. హైకోర్టు ఆగ్రహం