ETV Bharat / bharat

యువతిని అపహరించి అత్యాచారం.. నిందితుడు అరెస్ట్​ - ఉత్తర్​ప్రదేశ్​ రేప్ బాధితులు

యూపీలో ఓ యువతిని ఓ వ్యక్తి అపహరించి అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన వెలుగుచూసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. మరో ఘటనలో 80ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సదరు వ్యక్తి ఇప్పటికే 13ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

RAPE
రేప్
author img

By

Published : Oct 29, 2021, 8:42 PM IST

యువతి అపహరణ.. అత్యాచారం..

ఉత్తర్​ప్రదేశ్​ బల్లియాలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై 'పోక్సో' చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది..

ఈ నెల 24న సోనూ సింగ్ అనే వ్యక్తి తన గ్రామానికి చెందిన ఓ యువతిని అపహరించాడు. ఆమెను సమీప ప్రాంతాలైన బల్లియా, కాన్పూర్​లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఐపీసీ, పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మరోవైపు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై విచారణ జరుపుతున్నామని.. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

ఆ మృగాడికి జీవిత ఖైదు

మధ్యప్రదేశ్​లో 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా వీరేంద్ర ఆదివాసీ అనే 24 ఏళ్ల యువకుడిని దోషిగా తేల్చింది కోర్టు.

అప్పట్లో సంచలనం..

సాగర్ జిల్లాకు చెందిన 80ఏళ్ల వృద్ధురాలు 2019 జనవరి 11న తన గుడిసెలో శవమై కనిపించిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. బాధితురాలిపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తులో నిందితునికి వ్యతిరేకంగా.. పలు ఆధారాలు సేకరించారు.

ఈ కేసులో తీర్పు వెలువరించిన అదనపు సెషన్స్ జడ్జి దీపాలీ శర్మ.. దారుణ నేరాలకు పాల్పడిన నిందితునికి జీవిత ఖైదు సరైన శిక్ష అని వ్యాఖ్యానించారు. రూ.11,000 జరిమానా సైతం విధించారు.

13ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులోనూ దోషిగా తేలిన వీరేంద్ర ఆదివాసీకి మూడు నెలల క్రితమే మరణశిక్ష విధించింది కోర్టు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.