పెళ్లి అయిన తర్వాత కూడా ప్రియుడిని మర్చిపోలేకపోయింది ఓ మహిళ. రోజూ అతడితో ఫోన్లో మాట్లాడేది. ఇంటి నుంచి పారిపోయి ఇద్దరు వివాహం చేసుకుందామనుకున్నారు. అనుకున్నట్లుగా ప్లాన్ వేసి మరీ ఇంటి నుంచి పారిపోయారు. అది కాస్త గ్రామస్థులు చూసేశారు. వారిద్దరిని పట్టుకున్నారు. మహిళ భర్తకు వెంటనే సమచారం అందించారు. తీరా అతడు వచ్చి ఏమి అనకుండా.. తన భార్యను ప్రియుడికి అప్పగించాడు. ఝార్ఖండ్‌లోని పలాము జిల్లాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
మనటు పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలా గ్రామానికి చెందిన సనోజ్ కుమార్ సింగ్‌కు మే 10న వివాహం జరిగింది. లెస్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కదిహ్ నివాసి అయిన ప్రియాంక కుమారిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ప్రియాంక కుమారికి అదే గ్రామానికి చెందిన జితేంద్ర విశ్వకర్మ అనే యువకుడితో 2012 నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరి పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.
అయితే ప్రేమ విషయం తెలిసిన వెంటనే ప్రియాంకను సనోజ్ కుమార్ సింగ్‌తో వివాహం జరిపించారు ఆమె కుటుంబసభ్యులు. అయితే పెళ్లి తర్వాత కూడా ప్రియాంక తన ప్రియుడు జితేంద్రను మర్చిపోలేకపోయింది. ప్రతి రోజు ఫోన్లో మాట్లాడేది. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. మంగళవారం ప్రియాంకను తీసుకెళ్లేందుకు జితేంద్ర.. కిలా గ్రామానికి వచ్చాడు. ప్రియాంకను తీసుకుని జితేంద్ర పారిపోయాడు.
అదే సమయంలో వీరిద్దరిని కిలా గ్రామస్థులు చూశారు. వెంటనే పట్టుకున్నారు. ఆ తర్వాత విషయమంతా సనోజ్ కుమార్ సింగ్‌కు తెలియజేశారు. సనోజ్ కుమార్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని భార్యను ఒక్క మాట కూడా అనలేదు. తన భార్య ప్రియాంకను ప్రియుడికి అప్పగించాడు. ఇదే విషయాన్ని సనోజ్ కుమార్ సింగ్.. ప్రియాంక కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ వ్యవహారమంతా పోలీసులకు చేరింది. వారు అక్కడికి చేరుకున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదు.
అప్పులకు బదులు భార్యను అప్పగించిన భర్త
అప్పులకు బదులుగా భార్యను అప్పగించిన ఉదంతం రాజస్థాన్‌లోని చురు జిల్లాలో జరిగింది. తన భర్తే అప్పు ఇచ్చిన వారితో సంబంధాలు పెట్టుకోవాలని తనను బలవంతంగా చేశాడని.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ మహిళ.. బుధవారం సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.