ETV Bharat / bharat

ఎన్నికల కోసం బ్రహ్మచర్యానికి బై.. పెళ్లికి సై!

ఎన్నికల్లో పోటీ చేసేందుకు, అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ నాయకులు ఎన్ని పాట్లైనా పడతారు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి తనదైన శైలిలో ఇది నిజమని నిరూపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

balia man gets married for elections
ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివాహం చేసుకున్న వ్యక్తి
author img

By

Published : Apr 1, 2021, 8:35 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బాలియాకు చెందిన హతి సింగ్(45) జీవితాంతం వివాహం చేసుకోనని వాగ్దానాలు చేశారు. రాజకీయంగా ఎదగాలని కలలు కన్నారు. అయితే.. ఎన్నికల బరిలో దిగాలనుకున్న ఆయనకు.. ఈ సారి నిరాశే ఎదురైంది. పంచాయతీ​ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మహిళలకే దక్కిందని తెలిసింది.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి నెగ్గాలని ఆశించిన సింగ్.. తొలుత తాను చేసిన శపథాన్ని వెనక్కి తీసుకున్నారు. నిధి సింగ్​ అనే మహిళను వివాహం చేసుకున్నారు. తన భార్యను ఎన్నికల బరిలో దించేందుకు సిద్ధమయ్యారు.

balia, hathi singh
పెళ్లి చేసుకున్న హతి సింగ్

"గ్రామాభివృద్ధి, దేశ సేవకంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. అందుకే నిధి సింగ్​ను వివాహం చేసుకున్నాను. గ్రామాభివృద్ధికై పాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా."

-హతి సింగ్.

ప్రస్తుతం హతి సింగ్​ దంపతుల వివాహ వేడుకల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

balia, hathi singh
ఎన్నికల్లో పోటీ చేసేందుకే పెళ్లి

ఇదీ చదవండి:'మినీ సమరం'లో 18 శాతం మంది నేరచరితులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.