రాజస్థాన్ జైపుర్‌లోని స్ట్రీట్‌ఫుడ్ వ్యాపారి శైలేష్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సలసల మరుగుతున్న నూనెలో చికెన్ ఫ్రై చేసి.. గరిటె లేకుండా చేతులతోనే ఆ ముక్కలను బయటకు తీశాడు ఆయన. రెండు చేతులనూ నునెలో పెట్టి కిలోల కొద్ది చికెన్‌ను ఫ్రై చేశాడు. అయినా ఆయన వేళ్లకు ఏమీ కాలేదు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఆయనకు స్పర్శ లేదా? వెళ్లు కాలవా? అని ప్రశ్నిస్తున్నారు. మరొకరు వేళ్లు కాలిపోతాయేమో జాగ్రత్త.. అని ఫన్నీ కామెంట్ పెట్టారు. 'ఇంకొందరైతే ఇది మూమూలు చికెన్ ఫ్రై కాదు.. ఫింగర్ ఫ్రైడ్ చికెన్' అని జోకులు వేశారు.
జైపుర్‌లో రోడ్డు పక్కన ఉన్న ఈ ఫుడ్ స్టాల్ పేరు అలి చికెన్ సెంటర్. ఈ వీడియోలో శైలేష్ మొదట చికెన్‌ను కడాయిలో మరుగుతున్న నూనెలో వేశాడు. అనంతరం అది ఉడికాక రెండు చెేతులతో ఆ ముక్కలను బయటకు తీశాడు. ఆ తర్వాత చికెన్‌కు ఇంకొన్ని మసాలాలు కలిపి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. ఈ వీడియోను శైలేషే తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. అది కాస్త గంటల్లోనే వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: 'ఆ శిశువుకు రెండు తలలు!'.. చూసేందుకు ఎగబడిన జనం!!