ETV Bharat / bharat

పార్క్​ చేసిన 19 కార్లు ధ్వంసం- ఒక్కడే రాత్రికి రాత్రే... - kerala news today

జోరు వర్షం.. పైగా అర్ధరాత్రి.. ఎవరూలేరు.. కేరళ తంపనూర్​ రైల్వే స్టేషన్​లో పార్క్​ చేసిన 19 కార్లు ధ్వంసమయ్యాయి. కొన్నింటిలో వస్తువులు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు విషయం బయటపెట్టారు.

Man damages 19 cars parked at Thiruvananthapuram rly station, held
పార్క్​ చేసిన 19 కార్లు ధ్వంసం, cars damage, thiruvananthapuram
author img

By

Published : Oct 10, 2021, 7:30 PM IST

Updated : Oct 10, 2021, 7:44 PM IST

అర్ధరాత్రి.. యువకుడు విధ్వంసం

కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. తంపనూర్​ రైల్వే స్టేషన్​ పార్కింగ్​లో ఉంచిన 19 కార్లను ధ్వంసం చేశాడు.

ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ వాహనాలను తీసుకునేందుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు దీనిని గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.

ఓ వ్యక్తి కార్ల అద్దాలను ధ్వంసం చేసి.. అందులోని వస్తువులను తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. మధ్యాహ్నంలోగా ఆ 18 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతని మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. చికిత్స తీసుకోకపోవడం వల్లే.. ఇలా జరిగిందని నిందితుడు కూడా ఒప్పుకున్నట్లు వెల్లడించారు. అనంతరం అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'లఖింపుర్ ఘటనపై నిజాలు వినిపిస్తాం.. సమయమివ్వండి'

Last Updated : Oct 10, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.